ETV Bharat / sports

ఇమానె ఖెలిఫ్ కాంట్రవర్సీ- మెడికల్ రిపోర్ట్ లీక్ చేసిన వారిపై యాక్షన్​కు రెడీ

ఇమానె ఖెలిఫ్ సంచలన నిర్ణయం- ఆ మీడియాపై లీగల్ యాక్షన్​కు రెడీ అవుతున్న బాక్సర్!

Imane Khelif Controversy
Imane Khelif Controversy (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 7, 2024, 11:52 AM IST

Imane Khelif Controversy : ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ లింగ వివాదం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆమెకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్​ను ఫ్రెంచ్ మీడియా రీసెంట్​గా లీక్ చేసింది. ఆమె కాదు, 'అతడు' అంటూ సోషల్ మీడియాలో విమర్శలు రేగాయి. దీంతో 'ఆమె'కు ఇచ్చిన గోల్డ్‌ మెడల్‌ను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లూ వినిపించాయి. ఈ క్రమంలో ఇమానె కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుసింగి. తన మెడికల్ రిపోర్ట్ లీక్ చేసిన మీడియాపై లీగల్ యాక్షన్​కు సిద్ధమైనట్లు ఐవోసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

'ఇమానె ఖెలిఫ్‌ చట్టపరమైన చర్యలు తీసుకోవడాన్ని మేం అర్థం చేసుకుంటున్నాం. 2024 ఒలింపిక్స్‌ సమయంలో ఖెలిఫ్‌ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. తాజాగా వస్తున్న లీక్‌లపై పరువునష్టం దావా వేసేందుకు రెడీ అవుతోంది. లీగల్ యాక్షన్ విషయంలో ఐవోసీ ఎలాంటి కామెంట్‌ చేయదు. మెడికల్ రిపోర్ట్​ వాస్తవమేనా? కాదా? అని తెలియకుండా బయట పెట్టిన మీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకుంది' అని ఐవోసీ తెలిపింది.

ఆమె కాదు అతడే!
అయితే ఇమానె లింగ గుర్తింపునకు సంబంధించిన వైద్య నివేధికను ఫ్రెంచ్ మీడియా ఇటీవల బయటపెట్టింది. ఇందులో కీలక విషయాలు బయటపడడం వల్ల క్రీడావర్గాలు షాక్​కు గురయ్యాయి. ఖెలిఫ్‌ శరీరంలో అంతర్గంతగా వృషణాలు, XY క్రోమోజోములు ఉన్నట్లు మెడికల్ రిపోర్టులో తేలింది! దీంతో ఆమె లింగ వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. దీనిపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఆమె నుంచి స్వర్ణ పతకాన్ని వెనక్కి తీసుకోవాలని కోరాడు.

అప్పట్నుంచే విమర్శలు
పారిస్ ఒలింపిక్స్​లో ఇమానె లింగ వివాదానికి తెర లేచింది. క్వాలిఫికేషన్​ రౌండ్​లో ఇజ్రాయెల్ బాక్సర్​పై ఇమానె కేవలం 46 సెకన్లలోనే బౌట్ నెగ్గింది. దీంతో అప్పట్నుంచే ఆమెకు పురుష లక్షణాలున్నాయంటూ విమర్శలు రేగాయి. ఈ వివాదల మధ్యే ఇమానె విశ్వక్రీడల్లో పసిడి పతకం గెలిచింది. ఫైనల్​లో లి యాంగ్ (చైనా)పై 5- 0 తేడాతో నెగ్గి తొలి ఒలింపిక్ పతకం దక్కించుకుంది.

'ఆమె' గోల్డ్​మెడల్ వెనక్కి తీసుకోండి'- ఒలింపిక్ బాక్సర్​​పై హర్భజన్ షాకింగ్ కామెంట్స్!

ఛాంపియన్​గా బాక్సర్ ఇమానె- కాంట్రవర్సీల మధ్యే 'గోల్డ్' పట్టేసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.