ETV Bharat / sports

పెళ్లి గురించి ప్రశ్న - సిగ్గుపడుతూ మను బాకర్​ ఏం చెప్పిందంటే? - Manu Bhaker Marriage - MANU BHAKER MARRIAGE

Manu Bhaker Marriage : తన పెళ్లి గురించి పారిస్​ ఒలింపిక్స్​ డబుల్​ మెడల్ విన్నర్​ మను బాకర్​ స్పందించింది. ఆమె సిగ్గు పడుతూ ఏం చెప్పిందంటే?

source ETV Bharat
Manu Bhaker Marriage (source ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 26, 2024, 7:53 AM IST

మను బాకర్​ (source ETV Bharat)

Manu Bhaker Marriage : పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 రెండు పతకాలు గెలిచిన స్టార్‌ షూటర్‌ మను బాకర్‌ దేశం గర్వించేలా చేసింది. అలానే ఆమె ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. దీంతో ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా ఆమె పేరే వినిపిస్తోంది. ఆమె వెళ్లినా ప్రతిచోటా ఘన స్వాగతం దక్కడం, సన్మానాలు జరగడం అవుతున్నాయి. ఇదే సమయంలో మను బాకర్​ పెళ్లిపై కూడా చాలా మందిలో ఆసక్తిగా నెలకొంది. ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది? ఎవరిని చేసుకుంటుంది? అని చాలా మందిలో ఉత్సుకత నెలకొంది.

అయితే తాజాగా మను బాకర్​ తన స్వస్థలం ఝజ్జర్‌(హరియాణా)కు వెళ్లింది. అక్కడ ఆమెకు ఘన స్వాగతం లభించింది. అక్కడి అధికారులు మనుకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అక్కడ ఆమె తన కుటుంబంతో కలిసి స్థానికంగా ఉన్న గోశాలలో పూజలు నిర్వహించింది.

ఈ సందర్భంగా అక్కడ మను బాకర్​ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అప్పుడు ఆమెకు పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. 'ఎప్పుడు చేసుకుంటార'ని అడగగా, మను బాకర్ నవ్వుతూ సిగ్గు పడింది. అదే సమయంలో మను బాకర్ తల్లి సుమేధా బాకర్ మాట్లాడుతూ మనుకు ఇంకా పెళ్లి వయసు రాలేదని, చిన్న పిల్లేనని చెప్పారు. మను చేయాల్సింది ఇంకా చాలా ఉందని పేర్కొన్నారు.

అనంతరం మను బాకర్ మాట్లాడుతూ ప్రస్తుతానికి పెళ్లి గురించి ఆలోచన లేదని, భవిష్యత్​లో దేవుడు ఏం రాసి పెట్టాడో చూడాలి అని చెప్పింది. ప్రస్తుతం దేశం కోసం స్వర్ణం సాధించడమే తన లక్ష్యమని, దానిపైనే తాను దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చింది.

కాగా, అంతకుముందు మను బాకర్​ తండ్రి రామ్‌ కిషన్ బాకర్ మీడియాతో మాట్లాడుతూ "మను ఇంకా చిన్నపిల్ల. ఆమెకు పెళ్లి వయసు రాలేదు. మేం అసలు ఆ విషయం గురించి ఆలోచించడం కూడా లేదు" అని బదులిచ్చారు. నీరజ్ బంధువు కూడా ఈ ఊహాగానాలపై మాట్లాడుతూ "నీరజ్ మెడల్ సాధించినప్పుడు దేశం మొత్తం ఎలా చూసిందో అలాగే పెళ్లి విషయం కూడా అందరికీ తెలుస్తుంది" అని క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే 'బాలీవుడ్‌లో నటించే ఆలోచనలు ఉన్నాయా?' అని మరో ప్రశ్న అడగగా - ప్రస్తుతం తనకు నటించే ఉద్దేశం లేదని మను బాకర్​ క్లారిటీ ఇచ్చింది.

'ఆ క్రికెటర్లు అంటే నాకు చాలా ఇష్టం - ఆయన మాత్రం ఇన్​స్పిరేషన్' - Manu Bhaker Favourite Cricketer

షూటింగ్‌కు మను బాకర్​ విరామం! - నెక్ట్స్​ ఏం చేయబోతుందంటే? - Manu Bhaker Break from Shooting

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.