Neeraj Chopra Manu Bhaker : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 2024 డైమండ్ లీగ్‌లో 1 సెంటీమీటర్ తేడాతో తొలి స్థానం కోల్పోయాడు. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ పోటీలో నీరజ్ బల్లెంను 87.86 మీటర్లు విసిరి రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఈ పోటీలో పీటర్స్ అండర్సన్ (గ్రెనెడా) ఈటను 87.87 మీటర్ల దూరం విసిరి ఛాంపియన్‌గా నిలిచాడు.
అయితే ఈ ఫైనల్‌కు తాను చేతి గాయంతోనే బరిలోకి దిగినట్లు పోటీ అనంతరం నీరజ్ సోషల్ మీడియా ద్వారా చెప్పాడు. ఈ మేరకు చేతి ఎక్స్ రే ఫొటోను షేర్ చేశాడు. కాగా, ఈ పోస్ట్‌ను ఒలింపిక్ మెడల్ విన్నర్, స్టార్ షూటర్ మను బాకర్ తన అకౌంట్లో షేర్ చేసింది. నీరజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. 'ఛాంపియన్ నీరజ్ 2024 సీజన్లో సాధించిన దానికి నీకు అభినందనలు. ఈ గాయం నుంచి త్వరగా కోలుకొని రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలంని ఆకాంక్షిస్తున్నా' అని మను ట్విట్టర్లో రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 'ఓ ఛాంపియన్, ఇంకో ఛాంపియన్‌ను ప్రశంసిస్తుంది', 'నీరజ్ నువ్వు నిజమైన హీరో', 'ఇది చిన్న గాయమే త్వరగానే నువ్వు కోలుకుంటావు' అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Congratulations @Neeraj_chopra1 on a fantastic season in 2024. Wishing you a speedy recovery and more success in the coming years.#NeerajChopra https://t.co/4NUgfVtiAf
— Manu Bhaker🇮🇳 (@realmanubhaker) September 15, 2024
కాగా, పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా నీరజ్, మను బాకర్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందంటూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మను అమ్మ, నీరజ్‌తో సన్నిహితంగా మాట్లాడిన వీడియో ఒకటి వైరలైంది. దీంతో ఈ వార్తలకు బలం చేకూరింది. వీరిద్దరూ లవ్‌లో ఉన్నారంటూ ప్రచారం సాగింది. కానీ, ఈ వార్తలను అటు మను బాకర్ ఫ్యామిలీ, ఇటు నీరజ్ కొట్టి పారేశారు. వాళ్లిద్దరి అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేశారు.
Manu Bhaker’s Mother with Neeraj Chopra. pic.twitter.com/SDWbaWeOG7
— Avinash Aryan (@avinasharyan09) August 11, 2024
Paris Olympics : పారిస్ వేదికగా ఇటీవల ముగిసిన విశ్వక్రీడల్లో మను వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ షూటింగ్ విభాగాల్లో రెండు కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు నీరజ్ చోప్రా పరుషుల జావెలిన్ త్రో లో రజతం దక్కించుకున్నాడు.
'వేలు విరిగినా బరిలోకి దిగాను'- డైమండ్ లీగ్ ఫైనల్‌పై నీరజ్ - Neeraj Chopra Diamond League
మను బాకర్, నీరజ్ స్పెషల్ చిట్‌చాట్- వీడియో వైరల్- మేటర్ ఏంటంటే? - Paris Olympics 2024