ETV Bharat / sports

అండర్సన్ అరుదైన ఘనత- 72 ఏళ్ల రికార్డ్ బ్రేక్ - ind vs eng test series 2024

Oldest Player Test Cricket In India: విశాఖపట్టణం టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్​లో అతడు 72 ఏళ్ల రికార్డు బ్రేక్ చేశాడు.

Oldest Player Test Cricket In India
Oldest Player Test Cricket In India
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 7:11 PM IST

Oldest Player Test Cricket In India: భారత్- ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టులో ఓ అరుదైన సంఘటన జరిగింది. ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ దాదాపు 6 నెలల తర్వాత ఈ మ్యాచ్​తో టెస్టుల్లో బరిలోకి దిగాడు. 2003లో కెరీర్ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అండర్సన్ సుమారు 22 ఏళ్లుగా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే 41 (41 ఏళ్ల 187 రోజులు) ఏళ్ల అండర్సన్​ భారత్ గడ్డపై టెస్టు మ్యాచ్​ ఆడిన అత్యంత పెద్ద వయస్కుడి(పేసర్) గా నిలిచాడు. ఈ క్రమంలో 72 ఏళ్ల పాత రికార్డ్​ను అండర్సన్ బ్రేక్ చేశాడు. 1952లో టీమ్ఇండియా ప్లేయర్ లాలా అమర్నాథ్ (41 ఏళ్ల 92 రోజులు) భారత్​లో టెస్టు మ్యాచ్​ ఆడిన అత్యధిక వయసున్న ప్లేయర్​గా కొనసాగాడు. కాగా, ఇప్పుడు అండర్సన్ ఆ రికార్డును బద్దలుకొట్టాడు.

భారత్​లో టెస్టు మ్యాచ్​ ఆడిన అత్యంత పెద్ద వయసు పేసర్లు

  • జేమ్స్ అండర్సన్- 41 ఏళ్ల 187 రోజులు ఇంగ్లాండ్ vs భారత్ (2024)
  • లాలా అమర్నాథ్- 41 ఏళ్ల 92 రోజులు- భారత్ vs పాకిస్థాన్ (1952)
  • రే లిండ్​వాల్- 38 ఏళ్ల 112 రోజులు- ఆస్ట్రేలియా vs భారత్ (1960)
  • షుట్ బెనర్జీ- 37 ఏళ్ల 124 రోజులు- భారత్ vs వెస్టిండీస్ (1949)
  • గులమ్ గార్డ్- 34 ఏళ్ల 20 రోజులు- భారత్ vs ఆస్ట్రేలియా (1960)

ఈ వయసులోనూ అండర్సన్​ ఫిట్​గా ఉండడం విశేషం. ఈ మ్యాచ్​లో అండర్సన్ శుభ్​మన్ గిల్ (34)ను పెవిలియన్ చేర్చాడు. మొత్తం 17 ఓవర్లు బౌలింగ్ చేసిన అండర్సన్ 1.80 ఎకనమీతో 30 పరుగులిచ్చి ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. అందులో 3 మెయిడెన్లు ఉన్నాయి.

James Anderson Test Wickets: అండర్సన్​ టెస్టు కెరీర్​లో ఇప్పటివరకు 183 మ్యాచ్​ల్లో మొత్తం 691 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో అతడు టెస్టు క్రికెట్‌లో మూడో అత్యధిక వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీథరన్‌ 800 వికెట్లు, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ షేన్‌ వార్న్‌ 708 వికెట్లు టాప్- 2 పొజిషన్లలో ఉన్నారు.

రెండో టెస్టుతో ఆండర్సన్‌ ఎంట్రీ - అప్పటికి ఆ ఇద్దరు పుట్టనేలేదు

ఫస్ట్​ డే 'యశస్వి'దే- భారీ శతకంతో జైశ్వాల్ అదరహో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.