NZ vs AUS t20 Rachin Ravindra : ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 తొలి టెస్టులో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లో 50 పరుగుల మార్క్ అందుకున్నాడు. ఓపెనర్ డెవాస్ కాన్వేతో కలిసి రచిన్ పరుగుల వర్షాన్ని కురిపించాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరును నమోదు చేసింది.
మూడు టీ20, రెండు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌కు పర్యటనకు వెళ్లింది. అందులో భాగంగా వెల్లింగ్‌టన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ బుధవారం మొదలైంది. ఇక టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే తమ ఇన్నింగ్స్‌తో జట్టుకు శుభారంభాన్ని అందించారు. అయితే ఆ తర్వాత బరిలోకి దిగిన రచిన్ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఇక ఫిన్ అలెన్ 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 17 బంతుల్లో 32 పరుగులతో శుభారంభం చేశాడు. కాన్వే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 బంతుల్లో 63 పరుగులతో మెరిశాడు. ఇక ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర 2 ఫోర్లు, 6 సిక్స్‌లు 35 బంతుల్లోనే 68 పరుగులు సాధించాడు. అయితే రచిన్‌కు టీ20లో ఇదే తొలి అర్థ శతకం కావడం విశేషం. కేవలం 29 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. ముందు 16 బంతుల్లో కేవలం 14 పరుగులే చేశాడు. తర్వాత 19 బంతుల్లో 54 పరుగులతో సత్తా చాటాడు.
మరోవైపు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ 10 బంతుల్లో 19, ఐదో నంబర్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్ 13 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా నిలిచారు. దీంతో 20 ఓవర్లలో న్యూజిలాండ్ కేవలం మూడు వికెట్లకు 215 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు 216 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. ఇక ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్, పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
బజ్‌బాల్‌కు కఠిన పరీక్ష - ఇంగ్లీష్ జట్టు పరిస్థితేంటో?
'ధోనీ వల్లే ఇదంతా - లేకుంటే నేనూ విరాట్, రోహిత్‌లా అయ్యుంటా'