ETV Bharat / sports

హాకీ ఇండియా - శ్రీజేశ్‌ వారసుడు అతడేనా? - India Hockey New Goal Keeper - INDIA HOCKEY NEW GOAL KEEPER

India Hockey New Goal Keeper Krishan Bahadur Pathak : గోల్ కీపర్​ శ్రీజేష్​ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దీంతో గోల్​ కీపర్​గా హాకీలో అతడి వారసుడెవరు? అతడు లేని లోటును ఇతరులు తీర్చగలరా? అసలు తీర్చడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు ప్రస్తుతం భారత హాకీకి ఎదురవుతున్నాయి. వాటికి సమాధానాలే ఈ కథనం.

source Associated Press
India Hockey Goal keeper (source Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 19, 2024, 7:40 AM IST

India Hockey New Goal Keeper Krishan Bahadur Pathak : అతడు బరిలో దిగితే ఓ భరోసా. తన సర్వశక్తులు ఒడ్డి పోరాడుతాడు. గోడలా నిలుస్తాడు. అందుకే ప్రత్యర్థి జట్టు గోల్‌ కొట్టాలంటే శ్రమించాల్సిందే. ఇప్పటికే తన అసాధారణ నైపుణ్యం, ప్రదర్శనతో భారత్‌ వరుసగా రెండు ఒలింపిక్‌ కాంస్య పతకాలు సాధించడంలో అత్యంత కీలక పాత్ర కూడా పోషించాడతడు. అతడే గోల్ కీపర్​ శ్రీజేష్​. కానీ ఇప్పుడతడు తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో గోల్​ కీపర్​గా హాకీలో అతడి వారసుడెవరు? అతడు లేని లోటును ఇతరులు తీర్చగలరా? అసలు తీర్చడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు ప్రస్తుతం భారత హాకీకి ఎదురవుతున్నాయి.

అయితే ఈ ప్రశ్నలకు ఓ సమాధానం ఉంది. అదేంటంటే కృష్ణ బహదూర్‌ పాఠక్‌. శ్రీజేశ్‌ స్థానాన్ని ఇతడే భర్తీ చేయనున్నాడు. అప్పటి చీఫ్‌ కోచ్‌ హరేంద్ర సింగ్‌ ఆధ్వర్యంలో 2018లో అరంగేట్రం చేశాడు. 2019లో గ్రాహం రీడ్‌ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గోల్​ కీపర్​ శ్రీజేశ్‌కు డిప్యూటీగా వ్యవహరిస్తున్నాడు.

అయితే రీడ్‌ ప్రతి క్వార్టర్‌కు కూడా కీపర్లను మారుస్తుండేవాడు. అందుకు కారణం పాఠక్‌ కూడా మ్యాచ్‌ టైమ్, అనుభవం పొందాలని అతడు భావించడమే కారణం. అవసరమైనప్పుడు పాఠక్​ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని రీడ్​ అలా చేసేవాడు.

ప్రస్తుత చీఫ్‌ కోచ్‌ క్రెయిగ్‌ ఫుల్టాన్‌ కూడా ఇదే విధానాన్ని(ప్రతీ క్వార్టర్​కు కీపర్లను మార్చడం) కొనసాగిస్తూ ముందుకెళ్లాడు. దీంతో ఆసియా గేమ్స్, వరల్డ్​ కప్‌ సహా అనేక మ్యాచుల్లో ఛాలెంజెస్​ ఎదురైనప్పుడు పాఠక్‌ ఎంతో పరిణతిని, సంయమనాన్ని పాటించాడు. ఇప్పటివరకు అతడు దాదాపు 125 మ్యాచ్‌ల వరకు ఆడాడు.

దీంతో పాఠక్​ శ్రీజేశ్‌ లేని లోటును భర్తీ చేస్తాడని ఆశిస్తున్నారు. ఇదే విషయాన్ని భారత గోల్‌కీపింగ్‌ సలహాదారు డెన్నిస్‌ వాన్‌ డి పోల్‌ చెప్పాడు. "ఇది పాఠక్‌ సమయం. 2023 వరల్డ్ కప్​లో శ్రీజేశ్, పాఠక్‌లు ఇద్దరూ సమానంగా తమ సత్తా చాటారు" అని పోల్ చెప్పుకొచ్చాడు.

పాఠక్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ 2024కు ముందు అన్ని ముఖ్యమైన ఈవెంట్లలోనూ బరిలోకి దిగాడు. అయితే ఇతర టోర్నీల తరహాలో ఒలింపిక్‌ టీమ్​లో 18 మంది ఉండే అవకాశం ఉండదు. కేవలం 16 మందికే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాఠక్‌ స్టాండ్‌బైగా పారిస్​కు వెళ్లాడు. టోక్యోకు కూడా అలానే వెళ్లాడు. అందుకే అతడు పోడియంపై నిలబడలేకపోయాడు.

మరి డిప్యూటీ ఎవరు? - పాఠక్‌ గోల్‌కీపర్‌గా బాధ్యతలు స్వీకరించాక అతడికి డిప్యూటీగా ఎవరు ఉంటారు? మ్యాచ్‌లో ప్రతి క్వార్టర్‌కు గోల్‌ కీపర్‌ను మార్చే విధానాన్ని కొనసాగిస్తారా? లేదా ఇతర టీమ్స్​ తరహాలోనే ఒకే గోల్‌ కీపర్‌కు కట్టుబడి ఉంటారా? అనేది చూడాలి. అయితే సూరజ్‌ కర్కేరా, పవన్‌ మలిక్​, మోహిత్‌కు మంచి టాలెంట్​ ఉందని, వీరికి మరింత శిక్షణ ఇచ్చి, వీరిలో రెండో స్థానం కోసం ఎవరిని తీసుకుంటారో చూడాలి అని డెన్నిస్​ పేర్కొన్నాడు.

శ్రీజేశ్​కు అరుదైన గౌరవం- జెర్సీ నెం.16ని రిటైర్ చేసిన హాకీ ఇండియా - P R Sreejesh Jersey

వరుసగా 6 గోల్డ్​ మెడల్స్​ - ఒలింపిక్స్ చరిత్రలో భారత హాకీ జట్టు సాధించిన ఘనతలు ఇవే - Paris Olympics 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.