ETV Bharat / sports

భారత్​కు తిరిగి వస్తా - సానియాతో కలిసి పని చేస్తా : జకోవిచ్ - నొవాక్ జకోవిచ్ సానియా మీర్జా

Novak Djokovic Sania Mirza : ఆస్ట్రేలియ‌న్ ఓపెన్​లో వర‌ల్డ్ నెం.1, సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్ జ‌కోవిచ్​ ఇండియన్ స్టార్ సానియా మీర్జా గురించి మాట్లాడాడు. భారత్​కు తిరిగి రావాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 3:50 PM IST

Novak Djokovic Sania Mirza : ఆస్ట్రేలియ‌న్ ఓపెన్​లో వర‌ల్డ్ నెం.1, సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్ జ‌కోవిచ్​ అదిరే ప్రదర్శన చేస్తున్నాడు. క్వార్టర్​ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం జ‌రిగిన‌ నాలుగో రౌండ్ మ్యాచ్‌లో అడ్రియ‌న్ మ‌న్నారినోను చిత్తుగా ఓడించాడు. వ‌రుస సెట్లలో 6-0, 6-0, 6-3తో గెలుపొంది రికార్డు స్థాయిలో 58వ సారి గ్రాండ్​స్లామ్​ క్వార్ట‌ర్స్‌లో అడుగుపెట్టాడు ఈ సెర్బియన్ స్టార్​.

అయితే తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన జకోవిచ్​ భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా గురించి మాట్లాడాడు. భారత్​తో తనకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నాడు. భారత్‌తో తనకు మంచి బంధం ఉందని, అక్కడ టెన్నిస్‌ అభివృద్ధికి సానియా మీర్జాతో కలిసి పనిచేస్తాని అన్నాడు.

"భారత్​తో నాకు గొప్ప బంధం ఉంది. సెర్బియా, ఇండియా హిస్టరీని పరిశీలిస్తే చాలా సారూప్యతలు ఉన్నాయి. నాకు ఇండియన్స్​ అంటే చాలా ఇష్టం. వారు ఎప్పుడూ నన్ను అభిమానిస్తూనే ఉంటారు. వారికి ప్రేమాభిమానాలు ఎక్కువ. వారు ఎక్కువగా క్రీడలను ఇష్టపడతారు. భారత్‌లో క్రికెట్‌ ఒక మతంగా ఉన్నా టెన్నిస్‌ను కూడా ఎక్కువగా ఆదరిస్తారు. నేను దాదాపు పదేళ్ల క్రితం దిల్లీలో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల కోసం భారత్‌కు వెళ్లాను. రెండు రోజులు పాటు అక్కడే ఉన్నాను. మళ్లీ భారత్​కు తిరిగి రావాలనుకుంటున్నాను. భారత్‌లో పిల్లల అభివృద్ధికి ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని కార్యక్రమాలలో భాగం కావాలని అనుకుంటున్నాను. ఇటువంటి సేవా కార్యక్రామాలు నా భార్యకు కూడా చాలా ఇష్టం. అదే మా ఫౌండేషన్ లక్ష్యం కూడా. ఎక్కువ మంది పిల్లలు టెన్నిస్ రాకెట్ పట్టుకుని ఆడటం నాకు చాలా ఇష్టం. టెన్నిస్‌ అభివృద్దికి నేను అన్ని విధాలగా కృషి చేస్తాను. ఈ మిషన్‌ కోసం మనమిద్దరం(సానియా మీర్జా) కలిసి పనిచేద్దాం" అని జకోవిచ్‌ పేర్కొన్నాడు.

ఇకపోతే ఈ సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి నంబర్‌వన్‌గా గతేడాది సీజన్‌ను ముగించాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, యుఎస్‌ ఓపెన్‌లను సొంతం చేసుకున్న అతడు ఆ మధ్య డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టోర్నీని కూడా గెలిచి నంబర్‌వన్‌ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.

'వాళ్ల బంధం అప్పుడే ముగిసింది- డివోర్స్​పై సానియా ఫ్యామిలీ క్లారిటీ'

షోయబ్ మాలిక్ 'మూడో పెళ్లి'- సానియా పరిస్థితేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.