Next Generation Fab 4 : క్రికెట్‌లో ప్రతి తరంలో కొందరు ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటారు. ప్రస్తుతం ఫ్యాబ్ ఫోర్ అనగానే చాలా మందికి విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ గుర్తుకువస్తారు. ఈ నలుగురు క్రికెట్ ఆడుతుండగానే కొత్త తరం భారీ అంచనాలు పెంచుతోంది. ఈ ఫ్యాబ్ ఫోర్ స్థానాలను ఆక్రమించేందుకు నలుగురు యంగ్ ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం యంగ్ ప్లేయర్లు యశస్వీ జైస్వాల్, కమిందు మెండిస్, హ్యారీ బ్రూక్, రచిన్ రవీంద్ర అద్భుతంగా రాణిస్తున్నారు. నిలకడగా పరుగులు చేస్తూ ఫ్యాబ్ 4గా గుర్తింపు పొందుతున్నారు.
యశస్వీ జైస్వాల్
టీమ్‌ఇండియా యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ తన కృషి, దృఢ సంకల్పంతో ఈ స్థాయికి చేరుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణంలో జన్మించిన అతడు క్రికెట్ కలలను సాకారం చేసుకొనేందుకు ముంబయిలో అడుగుపెట్టాడు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని భారత జట్టులో చోటు సంపాదించాడు. వెస్టిండీస్‌తో జరిగిన తన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. చిన్న వయస్సులోనే ప్రశాంతత, మెచ్యూరిటీ చూపాడు. ఐపీఎల్‌లో సెంచరీ బాదడంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. భారత్ క్రికెట్‌ని ముందుకు తీసుకెళ్లే సత్తా తనలో ఉందని నిరూపించాడు.
For his consecutive fifties in the 2nd Test in Kanpur, Yashasvi Jaiswal receives the Player of the Match award 👏👏
— BCCI (@BCCI) October 1, 2024
Scorecard - https://t.co/JBVX2gyyPf#TeamIndia | #INDvBAN | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/XoIaQTrva4
కమిందు మెండిస్
శ్రీలంకకు చెందిన కమిందు మెండిస్ తన బ్యాటింగ్ స్కిల్స్‌తో త్వరగా పేరు తెచ్చుకున్నాడు. దాదాపు 75 ఏళ్లలో అత్యంత వేగంగా 1000 టెస్టు పరుగులు చేసిన డాన్ బ్రాడ్‌మాన్ రికార్డును సమం చేశాడు. అంకెల గురించి మాత్రమే కాదు, మెండిస్ తన ప్రారంభ టెస్ట్ మ్యాచ్‌లో గొప్ప టెక్నిక్‌తో భారీ స్కోరు సాధించాడు. విభిన్న ఫార్మాట్‌లలో రాణించగల సామర్థ్యంతో మెండిస్‌ని శ్రీలంక ఫ్యూచర్ స్టార్‌ని చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో మెండిస్ ఉజ్వల భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్నాడు.
హ్యారీ బ్రూక్
ఇంగ్లాండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ తన దూకుడుతో ఆకట్టుకుంటున్నాడు. తన నిర్భయమైన బ్యాటింగ్‌తో బ్రూక్ త్వరగా గుర్తింపు పొందాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో సంచలన ప్రదర్శనలు చేసిన బ్రూక్, అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. వేగంగా పరుగులు చేయడంతోపాటు అంతే సమర్థంగా బాల్‌ని డిఫెన్స్ చేయగలడు. మైదానంలో ఎప్పుడూ చలాకీగా కనిపించే బ్రూక్, నిమిషాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు.
రచిన్ రవీంద్ర
న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్ర ఇతరులంత పాపులర్ కాకపోయినా, ప్రతిభకు కొదవలేదు. రవీంద్ర కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా బౌలింగ్ కూడా చేయగలడు. గొప్ప ఆల్‌రౌండర్ స్కిల్స్ అతడిని న్యూజిలాండ్ భవిష్యత్తు స్టార్ క్రికెటర్‌గా నిలిపాయి. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ఆ టోర్నీలో రచిన్ 578 పరుగులతో సత్తా చాటాడు.
'ఫ్యాబ్ ఫోర్'లో ఎక్కువ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'లు ఎవరు సాధించారంటే? - Fab 4 Most Player Of The Series
అన్‌స్టాపబుల్ 'రూట్ '- సంగక్కర రికార్డ్ బ్రేక్- ఖాతాలో మరో మైల్స్టోన్ - Eng vs SL Test Series