ETV Bharat / sports

విలియమ్సన్ షాకింగ్ డెసిషన్- T20 ప్రపంచకప్​ ప్రదర్శనే కారణం! - T20 World Cup 2024

Kane Williamson Captaincy: న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ తన నిర్ణయంతో ఫ్యాన్స్​కు షాకిచ్చాడు. కివీస్ కెప్టెన్సీని వదులుకుంటున్నట్లు ప్రకటించాడు.

Kane Williamson
Kane Williamson (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 10:03 AM IST

Updated : Jun 19, 2024, 10:44 AM IST

Kane Williamson Captaincy: న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా ప్రకటించాడు. టీ20 వరల్డ్​కప్​లో కివీస్ ఆఖరి మ్యాచ్ తర్వాత విలియమ్సన్​ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడమే కాకుండా 2024-25 సంవత్సరానికి సంబంధించి సెంట్రల్ కాంట్రాక్ట్​ను కూడా వదులుకుంటున్నట్లు చెప్పాడు. ఇక న్యూజిలాండ్ సమ్మర్ సీజన్​లో ఓవర్సీస్ లీగ్​ల్లో ఆడనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

'న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప అవకాశంగా భావిస్తా. కివీస్​కు ఇంకా సహకారం అందిచాలనుకుంటున్నా. అందుకే ఇకపై కూడా జట్టులో కొనసాగుతాను. ఇక నా వ్యక్తిగత జీవితం చాలా మారిపోయింది. నా ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించి, వారితో గడపడం కూడా నాకు ముఖ్యం' అని కేన్ అన్నాడు. అయితే ప్రస్తుత పొట్టికప్​ టోర్నీలో కివీస్ ఓటమియే కేన్ నిర్ణయానికి కారణం అని తెలుస్తోంది. గ్రూప్ దశలో తొలి రెండు మ్యాచ్​ (అఫ్గానిస్థాన్, వెస్టిండీస్​పై)ల్లో ఓడిన కివీస్, అనంతరం పసికూనలు ఉగాండ, పపువా న్యూ గినియాపై నెగ్గింది. దీంతో నాలుగు పాయింట్లతో ముడో స్థానానికి పరిమితమైన కివీస్ టోర్నీ చరిత్రలో తొలిసారి సెమీస్ చేరకుండా ఇంటిబాట పట్టింది.

కెప్టెన్​గా రికార్డులు: కాగా, విలియమ్సన్​ కెప్టెన్సీలో కివీస్ 2021 డబ్ల్యూటీసీ ఛాంపియన్​గా నిలిచింది. ఇక కేన్ నాయకత్వంలో కివీస్, 2019 వన్డే వరల్డ్​కప్, 2021 టీ20 ప్రపంచకప్​ ఫైనల్​ దాకా వెళ్లి రన్నరప్​గా నిలిచింది. ​2016, 2022 టీ20 వరల్డ్​కప్​, 2023 వన్డే వరల్డ్​కప్​ల్లోనూ కివీస్​ సెమీఫైనల్​ దాకా చేరుకుంది. విలియమన్సన్ తన కెరీర్​లో 40 టెస్టులు, 91 వన్డేలు, 75 టీ20లకు కెప్టెన్​గా వ్యవహరించాడు. ఇక వైట్​బాల్​ ఫార్మాట్​ కెప్టెన్సీ నుంచి విలియమ్సన్ తాజాగా తప్పుకోగా, టెస్టు బాధ్యతలు ఎప్పుడో వదిలేశాడు.

త్వరలోనే రిటైర్మెంట్? 33ఏళ్ల విలియమ్సన్ 2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 100 టెస్టులు, 165 వన్డేలు, 93 టీ20ల్లో కివీస్​కు ప్రాతినిధ్యం వహించాడు. కెప్టెన్సీ వదులుకున్నాక జట్టులో కేవలం సభ్యుడిగానే కొనసాగనున్న విలియమ్సన్ ఇంక రోజులు కొనసాగేది క్లారిటీ ఇవ్వలేదు. అయితే త్వరలోనే కేన్ ఆటకు కూడా గుడ్​బై చెప్పవచ్చని అభిప్రాయాలు వెల్లువడుతున్నాయి.

ఫెర్గ్యూసన్ వరల్డ్​రికార్డ్- 4 ఓవర్లూ మెయిడెన్లే- 3 వికెట్లు కూడా

ఫాస్టెస్ట్ T20 సెంచరీ- 27 బంతుల్లోనే శతకం- ఎవరా ప్లేయర్?

Last Updated : Jun 19, 2024, 10:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.