Mustafizur Rahman IPL 2024: 2024 ఐపీఎల్‌కు ముందే చెన్నై సూుపర్ కింగ్స్ జట్టుకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చెన్నై జట్టు స్టార్ ప్లేయర్లు డేవన్ కాన్వే, మతీషా పతిరణ గాయాల కారణంగా 2024 ఐపీఎల్‌కు దూరం అయ్యారు. కాగా, తాజాగా బంగ్లాదేశ్ పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మన్ రానున్న ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
సోమవారం (మార్చి 18) సాయంత్రానికి ముస్తాఫిజుర్ చెన్నై జట్టుతో చేరాల్సి ఉంది. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్- శ్రీలంక వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా సోమవారం జరుగుతున్న మ్యాచ్‌లో తంజీమ్ హసన్ షకీబ్ స్థానాన్ని ముస్తాఫిజుర్ భర్తీ చేశాడు. ఈ మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ 42వ ఓవర్ బౌలింగ్ చేశాడు. ఓవర్ పూర్తైన తర్వాత ముస్తఫిజుర్ గ్రౌండ్లో కాస్త అసౌకర్యంగా కనిపించాడు.
అయినప్పటికీ ఫీల్డింగ్‌లో కొనసాగిన అతడికి 48వ ఓవర్ వేయాల్సిందిగా కెప్టెన్ బంతినిచ్చాడు. ఇక బంతి అందుకున్న ముస్తాఫిజుర్ ఒక్క బాల్ కూడా వేయలేకపోయాడు. ఒళ్లంతా తిమ్మిర్లతో బాధపడుతూ అక్కడే పడిపోయాడు. వెంటనే వైద్య సిబ్బంది మైదానంలోకి వచ్చి అతడిని స్ట్రెచర్‌పై ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లింది. దీంతో తీవ్రమైన బాధతో ముస్తాఫిజుర్ గ్రౌండ్‌ను వీడాల్సి వచ్చింది.
ఇక ముస్తాఫిజుర్ గాయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో 9 ఓవర్లు బౌలింగ్ చేసిన ముస్తాఫిజుర్ 39 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇక మరో నాలుగు రోజుల్లోనే ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉండగా ముస్తాఫిజుర్ ఇలా అవ్వడం చెన్నై యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేసే విషయమే. గత ఏడాది డిసెంబర్లో దుబాయ్‌లో జరిగిన వేలంలో ముస్తాఫిజుర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.2 కోట్లకు కొలుగోలు చేసింది.
చెన్నై జట్టు: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముకేశ్ చౌదరి, మతీషా పతిరణ, అజింక్యా రహానే, రషీద్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు అరవెల్లి.