Rohit Sharma IPL 2024:2024 ఐపీఎల్ ముందు నుంచి ఇప్పటి వరకు కూడా రోహిత్ శర్మ చుట్టూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది. ముఖ్యంగా అతడిని కాదని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకి ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ ఇవ్వడం పెద్ద దుమారమే రేపింది. రోహిత్, ముంబయి ఫ్యాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది. ముంబయి ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఫ్యాన్స్ తమ అసంతృప్తిని చూపించారు. చివరికి ఐపీఎల్ 2024లో ముంబయి జర్నీ ముగిసింది. 14 మ్యాచుల్లో కేవలం 4 విజయాలతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. టోర్నీ నుంచి మొట్టమొదట ఎలిమినేట్ అయ్యింది.
మరో వైపు రోహిత్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. కానీ, అతడి కాంట్రిబ్యూషన్ తక్కువ చేయలేం. 14 మ్యాచుల్లో 32.08 యావరేజ్, 150 స్ట్రైక్ రేట్‌తో 417 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఐపీఎల్ మెగా వేలం రాబోతుండటంతో, రోహిత్ ముంబయిలోనే ఉంటాడా? మరో జట్టుకు వెళ్తాడా? ఐపీఎల్‌కి రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడా? అని సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అయితే ఈ వివాదాలన్నీ ఎలా ఉన్నా, ప్రస్తుత సీజన్‌లో ఫ్యాన్స్‌కు రోహిత్ మంచి మెమోరిస్ అందించాడు. 2024 ఐపీఎల్‌లో హిట్‌మ్యాన్ మెమరెబుల్ మూమెంట్స్ ఏవో చూద్దాం.
ఫీల్డింగ్ అదుర్స్: రోహిత్‌కి ఇప్పుడు 37 సంవత్సరాలు. రోహిత్ ఫిట్‌నెస్‌పై చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఐపీఎల్ 2024లో తన ఫీల్డింగ్ ప్రదర్శనతో రోహిత్ విమర్శకులకు సమాధానమిచ్చాడు. మే 17న వాంఖడే స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన ముంబయి ఇండియన్స్ చివరి లీగ్ మ్యాచ్‌లో అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. 16వ ఓవర్ ఎంఐ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ వేశాడు. ఓవర్ లాస్ట్ బాల్‌ని కేఎల్ రాహుల్ స్క్వేర్ డ్రైవ్ ఆడాడు. బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న రోహిత్, తన కుడివైపుకి డైవ్ చేసి, బౌండరీని ఆపాడు. ఒక్క పరుగు కూడా రాలేదు. రోహిత్ డైవ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ తెగ లైకులు కొడుతూ, ఇతరులకు షేర్ చేశారు.
సిక్సుతో హాఫ్ సెంచరీ: లఖ్‌నవూతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబయి ఓడిపోయింది. రోహిత్ శుభారంభం ఇచ్చినా ఫలితం లేకపోయింది. 215 లక్ష్యాన్ని అందుకోలేక ముంబయి 196-6కి పరిమితమైంది. రోహిత్ 38 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. రోహిత్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీల్లో ఇది కూడా ఒకటి. రోహిత్ హిట్టింగ్‌తో పవర్‌ప్లే ముగిసే సమయానికి, ముంబయి 53-0కి దూసుకెళ్లింది. అప్పటికి రోహిత్ 23 బంతుల్లో 39 పరుగులు చేశాడు.
మోహ్సిన్ ఖాన్ వేసిన ఏడో ఓవర్‌లో మొదటి రెండు బంతులను ఫోర్లు కొట్టాడు. లాస్ట్ బాల్‌ని రోహిత్ క్రీజులో నుంచి ముందుకొచ్చి స్ట్రైట్‌గా భారీ సిక్సు బాదాడు. ఈ కళ్లు చెదిరే సిక్సుతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లెగ్-స్పిన్నర్ రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అవ్వడంతో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసింది. ముంబయి ఇండియన్స్ జెర్సీలో రోహిత్‌ని ఇక చూడమని భావించిన ఫ్యాన్స్, నిలబడి చప్పట్లు కొట్టారు.
ఫీల్డ్ సెట్ చేసిన మాజీ కెప్టెన్: మే 27న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్, ముంబయి మ్యాచ్ జరిగింది. ఇందులో ఓ మూమెంట్ ముంబయి కెప్టెన్ రోహిత్‌ని ఫ్యాన్స్‌కి గుర్తు చేసింది. ముంబయికి తాను కెప్టెన్ కాకపోయినా, రోహిత్ ఫీల్డింగ్ సెట్ చేస్తూ కనిపించాడు. పాండ్యని బౌండరీకి వెళ్లమనడం, బౌలర్‌కి సలహాలు ఇస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా విరుచుకుపడటంతో రోహిత్ యాక్షన్‌లోకి దిగాడు. దీనికి సంబంధించి వైరలైన ఒక క్లిప్‌లో, మాజీ కెప్టెన్ మైదానం చుట్టూ తిరుగుతూ, ఫీల్డింగ్ సెట్ చేస్తూ కనిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 277-3 స్కోరు చేసింది. ముంబయి 246-5కి పరిమితమైంది.
'రోహిత్ ఆడియోను ప్రసారం చేయలేదు - నీతికి కట్టుబడి ఉన్నాం' - IPL 2024
ముంబయికి రోహిత్ బైబై!- ఆఖరి మ్యాచ్ ఆడేశాడా?- కోచ్ రెస్పాన్స్ ఇదే - IPL 2024