ETV Bharat / sports

'ఆ మాట చాలా క్రేజీగా ఉంది - ధోనీకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు' - IPL 2024 - IPL 2024

MS Dhoni CSK : చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్ అంటూ పలు రూమర్స్ హల్​చల్ చేశాయి. ఇటీవలె బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో అతడు ఈ విషయంపై స్పందిస్తాడని అందరూ భావించారు. కానీ ధోనీ ఎటువంటి కామెంట్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో కెప్టెన్ కూల్ భవితవ్యంపై చెన్నై బౌలింగ్‌ కోచ్ ఎరిక్ సైమన్స్ తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే ?

MS Dhoni CSK
MS Dhoni CSK (Source : Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 3:43 PM IST

MS Dhoni CSK : ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చాప్టర్ ముగిసింది. ఇప్పటి వరకు అభిమానులను అలరించిన ఈ స్టార్ టీమ్, శనివారం ఆర్సీబీతో జరిగిన పోరులో ఓడి ప్లేఆఫ్స్‌కు ఛాన్స్​ను వదులుకుంది. అయినప్పటికీ ఎంఎస్ ధోనీ ఆటతీరు అభిమానులను అలరించింది. అంతే కాకుండా సీజన్ మొత్తంలో ధోనీ క్రేజ్‌ మాత్రం ఎక్కడా తగ్గలేదు. మ్యాచ్​ జరిగిన ప్రతి స్టేడియంలోనూ అతడి కోసమే తండోపతండాలుగా అభిమానులు వచ్చేవారంటే అందులో ఏమాత్రం అతిశయోక్తికాదు.

కానీ ఈ సీజన్‌ తర్వాత ధోనీ ఐపీఎల్​కు వీడ్కోలు పలుకుతాడన్న వార్తలు తెగ హల్​చల్ చేశాయి. బెంగళూరుతో మ్యాచ్‌ తర్వాత ధోనీ తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, ధోనీ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. అయితే కెప్టెన్ కూల్ భవితవ్యంపై చెన్నై బౌలింగ్‌ కోచ్ ఎరిక్ సైమన్స్ తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2010 నుంచి ఆయనకు ధోనీతో పరిచయం ఉందని, గేమ్‌ను అర్థం చేసుకోవడంలో ధోనీని మించిన వారెవరూ లేరంటూ కితాబులిచ్చారు.

"ధోనీతో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కష్టాల్లో ఉన్నప్పుడు జట్టును ఆదుకునే పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు అతడు. ధోనీ క్రీజ్‌లో ఉన్నాడంటే ఇక మ్యాచ్‌ విజయం సాధించే స్థితిలో మేమున్నట్లేనంటూ డగౌట్‌లో కూర్చొని అనుకొనేవాళ్లం. జట్టులో ఆ కాన్ఫిడెన్స్​ను నింపడంలో ధోనీకి మించినవారు లేరు. గేమ్‌ను ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవడంలోనూ అతడు ముందుంటాడు. గొప్ప క్రికెటర్లు అందరూ అలా చేయగలిగినప్పటికీ, దాన్ని ఆచరణలో పెట్టాలంటే మాత్రం అది ధోనీకే సాధ్యం. యంగ్ ప్లేయర్స్​ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటాడు. అయితే ప్రతి మ్యాచ్​లోనూ ధోనీ భవితవ్యంపై చర్చ కొనసాగుతోంది. ఇది వినడానికి చాలా క్రేజీ ఉంటుంది. ధోనీకి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. ఈ సీజన్‌కు ముందు జరిగిన ప్రీ సెషన్‌ ప్రాక్టీస్‌ సమయంలోనూ అతడి బ్యాటింగ్‌ను నేను ప్రత్యక్షంగా చూశాను. బంతిని అనలైజ్ చేసి అతడు ఎంతో చక్కగా ఆడుతాడు. ఇదే ఆటతీరును టోర్నీలోని మ్యాచుల్లోనూ చూశాం. అందుకే అతడు తన భవిష్యత్తుపై పూర్తి అవగాహనతోనే ఉంటాడు. తప్పకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు" అని ఎరిక్‌ వెల్లడించాడు.

ఇక ఈ సీజన్‌లో ధోనీ ఆడిన 14 మ్యాచుల్లో 161 పరుగులు సాధించాడు. దాదాపు ఇవన్నీ సిక్స్‌లు, ఫోర్లు రూపంలో వచ్చినవే కావడం గమనార్హం. తాజాగా బెంగళూరుతో చివరి లీగ్‌ మ్యాచ్‌లోనూ 13 బంతుల్లోనే 25 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

ఉత్కంఠ పోరులో సీఎస్కేకు షాక్​ - ప్లే ఆఫ్స్​కు ఆర్సీబీ - IPL 2024 CSK VS RCB

ధోనీ రిటైర్మెంట్​పై కోహ్లీ కీలక కామెంట్స్​ - ఇప్పుడందరూ దీని గురించే చర్చంతా! - IPL 2024 Dhoni Kohli

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.