MS Dhoni 183 : టీమ్ఇండియా దిగ్గజం, మిస్టర్ కూల్ ఎమ్ఎస్ ధోనీ క్రికెట్‌లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి గురువారానికి 19ఏళ్లు పూర్తైంది. 2005లో సరిగ్గా ఇదే రోజు ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్‌తో 145 బంతుల్లోనే 183* పరుగులు నమోదు చేశాడు. దీంతో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన బ్యాటర్‌గానూ రికార్డు సృష్టించాడు.
7 పరుగులకే వికెట్
2005లో శ్రీలంక వన్డే సిరీస్ కోసం భారత్ పర్యటనకు వచ్చింది. ఈ సిరీస్‌లో భాగంగా జైపుర్ వేదికగా మూడో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక, భారత్‌కు 299 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక భారీ ఛేదనలో టీమ్ఇండియా తొలి ఓవర్లోనే సచిన్ తెందూల్కర్ (2) వికెట్ కోల్పోయింది. దీంతో వన్ డౌన్లో క్రీజులోకి వచ్చిన ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అభిమానులకు మర్చిపోలేని జ్ఞాపకాన్ని అందిచాడు. ఫోర్లు, సిక్స్‌లతో స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. ధోనీ భారీ సెంచరీతో టీమ్ఇండియా 46.1 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ క్రమంలోనే అత్యధిక స్కోర్ సాధించిన వికెట్ కీపర్‌గా ఆస్ట్రేలియా స్టార్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (172 పరుగులు) పేరిట ఉన్న రికార్డను బ్రేక్ చేశాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన వికెట్ కీపర్‌గా ధోనీనే కొనసాగుతున్నాడు. 19ఏళ్లైనా ఇప్పటికీ ఈ రికార్డును మరే ఇతర వికెట్ కీపర్ బ్రేక్ చేయలేదు.
#OTD Dhoni smashed 183 against SL, which is still the highest individual score by a WK batsman in ODIs. pic.twitter.com/ix2bpm9NBV
— ' (@dhoniverse_) October 31, 2024
ధోనీ రికార్డ్ బ్రేక్ చేయడానికి అనేక మంది ఆటగాళ్లు ప్రయత్నించారు. సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ పలుమార్లు ఈ రికార్డుకు దగ్గరగా వచ్చాడు. 174 పరుగులు vs బంగ్లాదేశ్ (2023), 178 పరుగులు vs ఆస్ట్రేలియా (2016), 168 పరగులు vs బంగ్లాదేశ్ (2017) 168 పరుగులు చేశాడు. ఇలా ఎన్నిసార్లు ప్రయత్నించిన ధోనీ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయారు. కాగా క్రికెట్‌లో అత్యుత్తమ వికెట్ కీపర్- బ్యాటర్‌గా గొప్ప పేరు సాధించిన మహీ 538 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 17,266 పరుగులు చేశాడు. వన్డేల్లో 10773 , టెస్టుల్లో 4876, టీ20ల్లో 1617 పరుగులు సాధించాడు. ఇందులో 16 శతకాలు (10 వన్డే, 6 టెస్టు), 108 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి.
'లేట్‌గా లేవడం, కుక్కలతో ఆడటం!' - ధోనీ డైలీ రొటీన్ ప్లాన్ ఏంటో తెలుసా?
'అది చాలా కష్టమైంది!' : IPL 2025 ఆడటంపై క్లారిటీ ఇచ్చిన ధోనీ!