ETV Bharat / sports

భారత్​​తో మ్యాచ్ అంటే సున్నా చుట్టేయాల్సిందే!- ఎక్కువ సార్లు డ‌కౌటైన ప్లేయర్లు వీళ్లే - jonny bairstow vs india test

Most Ducks against India: రాజ్​కోట్ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ బెయిర్ స్టో టెస్టుల్లో భారత్​పై అత్యధికసార్లు డకౌటైన ప్లేయర్ల్​గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. మరి ఈ లిస్ట్​లో ఇంకా ఎవరున్నారు? ఎవరెవరు ఎన్నిసార్లు పరుగుల ఖాతా తెరవకముందే పెవిలియన్ చేరారో తెలుసా?

Most Ducks against India
Most Ducks against India
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 3:57 PM IST

Most Ducks against India: టెస్టు ఫార్మాట్​ క్రికెట్ అంటే ఆ కిక్కే వేరు. ఈ సంప్రదాయ ఫార్మాట్​లో జాతీయ జట్టు తరఫున ఆడాలని ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. టెస్టు క్రికెట్​కు 100ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ ఫార్మాట్​లో భారత్ ఇప్పటివరకు 577 మ్యాచ్​లు ఆడగా అందులో 176 నెగ్గి, 178 ఓడింది. ఇక 222 మ్యాచ్​లను డ్రా చేసుకుంది. ఒకటి టైగా ముగిసింది. భారత్ ఇందులో అత్యధికంగా ఇంగ్లాండ్​తో 134 మ్యాచ్​ల్లో, అఫ్గానిస్థాన్​తో 1 టెస్టు ఆడింది. ఈ క్రమంలో భారత్​తో మ్యాచ్​లో అత్య‌ధిక సార్లు డ‌కౌటైన ప్లేయర్లెవరో తెలుసా?

1. క‌గిసో ర‌బాడా (సౌతాఫ్రికా): త‌న ప‌దునైన బంతుల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను భ‌య‌పెట్టే రబాడా టెస్టులలో అప్పుడప్పుడూ సిక్స్​లు కూడా బాదగలడు. అయితే టెస్టుల్లో భారత్​తో మ్యాచ్​లో మాత్రం రబాడానే ఎక్కువసార్లు సున్నా చుట్టేశాడు. ఇప్ప‌టి దాకా 24 ఇన్నింగ్స్​ల్లో 5సార్లు రబాడా డ‌కౌట్ అయ్యాడు.

2. గ‌స్ లోగి (వెస్టిండీస్): గ‌స్ లోగి ఈ క్రికెట‌ర్ పేరు పెద్ద‌గా విన‌క‌పోవ‌చ్చు. ఇత‌డు వెస్టిండీస్​కు చెందిన ఆట‌గాడు. క‌రేబియ‌న్ జ‌ట్టు తరఫున 52 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 35.79 సగటుతో 2470 పరుగులు సాధించాడు. ఇండియాతో ఆడిన మ్యాచ్​ల్లో 23 ఇన్నింగ్స్ లో 5 సార్లు సున్నాకే వెనుదిరిగాడు.

3. బ్రెట్ లీ (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియా స్టార్ పేస‌ర్, స్పీడ్ గ‌న్ బ్రెట్ లీ ఇండియాపై ఎన్నో వికెట్లు తీశాడు. వేగ‌మైన బంతులేస్తూ బ్యాట‌ర్ల‌ను భ‌య‌పెట్టాడు. కానీ బ్యాటింగ్ విష‌యానికి వ‌స్తే, భారత్​తో జ‌రిగిన మ్యాచ్​ల్లో 16 ఇన్నింగ్స్ లు ఆడి 5 సార్లు డకౌట‌య్యాడు.

4. జోష్ హేజిల్​వుడ్ (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియా స్టార్ బౌల‌ర్ హేజిల్​వుడ్ కూడా క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు ప‌డ‌గొడ‌తాడు. హేజిల్​వుడ్ కూడా భారత్​తో జ‌రిగిన మ్యాచ్​ల్లో 23 ఇన్నింగ్స్​ల్లో 5 సార్లు జీరోకే పెవిలియ‌న్ చేరాడు.

5. స్టువ‌ర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్): స్టువ‌ర్ట్ బ్రాడ్ పేరు చెప్ప‌గానే మ‌న‌కు యువ‌రాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సులు గుర్తొస్తాయి. కానీ బ్రాడ్ వ‌ర‌ల్డ్ క్లాస్ బౌల‌రే. ఆ జ‌ట్టు త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల‌లో అత‌డూ ఒక‌డు. టీమ్ఇండియాతో ఆడిన 32 టెస్టు ఇన్నింగ్స్​ల్లో బ్రాడ్​ కూడా 5 సార్లు సున్నాకే వెనుదిరిగాడు.

6. షేన్​ వార్న్ (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియా దిగ్గ‌జ స్పిన్న‌ర్ టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల‌లో రెండో స్థానంలో ఉన్నాడు. అద్భుత‌మైన లెగ్ స్పిన్ బౌలింగ్ తో వికెట్ల‌ను గిరాటేసే ల‌క్ష‌ణం అత‌ని సొంతం. అయితే ఇండియాతో ఆడిన 22 ఇన్నింగ్స్​ల్లో 6 సార్లు డ‌కౌట్ అయ్యాడు.

7. మెర్విన్ డిల్లాన్ (వెస్టిండీస్): వెస్టిండీస్​కి చెందిన మాజీ ఫాస్ట్ బౌల‌ర్ మెర్విన్ డిల్లాన్ 38 టెస్టుల్లో 131 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అరంగేట్రం చేసిన అన‌తి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. భార‌త్​తో టెస్టుల్లో 15 ఇన్నింగ్స్​లు ఆడిన మెర్విన్ 6 సార్లు జీరోకే ఔట్ అయ్యాడు.

8. జేమ్స్ అండ‌ర్స‌న్ (ఇంగ్లాండ్): ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండ‌ర్స‌న్ లైన్ అండ్ లెంగ్త్​తో వికెట్లు తీసే సత్తా ఉన్న పేసర్. ఇప్పటికే అండర్సన్ టెస్టుల్లో 696 వికెట్లు పడగొట్టాడు. అయితే టీమ్​ఇండియాతో టెస్టుల్లో 53 ఇన్నింగ్స్​లు ఆడిన అండ‌ర్స‌న్ 6 సార్లు డకౌటయ్యాడు.

9. నాథ‌న్ లియాన్ (ఆస్ట్రేలియా): లియాన్ ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట‌ర్. 2011లో అంత‌ర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టీమ్ఇండియాతో ఇప్పటివరకు 40 ఇన్నింగ్స్​లు ఆడిన లియాన్ 7 సార్లు డ‌కౌట్ అయ్యాడు.

10. డానిశ్​ క‌నేరియా (పాకిస్థాన్): డానిశ్​ కనేరియా పాకిస్థాన్​కు చెందిన స్పిన్న‌ర్. అతడు టీమ్ఇండియాతో 15 ఇన్నింగ్స్​ల్లో 7 సార్లు జీరోకే ఔటయ్యాడు.

11. జానీ బెయిర్ స్టో: ఇంగ్లాండ్ స్టార్ బ్యాట‌ర్ జానీ బెయిర్ స్టో అత్యధికసార్లు డకౌటై ఈ లిస్టులో అందరి కంటే ముందున్నాడు. బెయిర్ స్టో భారత్​తో ఇప్ప‌టి దాకా 37 టెస్టు ఇన్నింగ్స్​లు ఆడ‌గా, అందులో అత్య‌ధికంగా 8 సార్లు డకౌట్​గా వెనుదిరిగాడు.

బహు పరాక్‌ - ఆ పోరాట స్ఫూర్తే పరుగుల తపస్విగా మార్చింది!

ఇంగ్లాండ్​తో నాలుగో టెస్ట్​ - టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ దూరం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.