ETV Bharat / sports

'సిరాజ్​ను దానికోసమే పక్కనబెట్టాం' - బీసీసీఐ క్లారిటీ

Mohammed Siraj England Series : ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టెస్ట్ సిరీస్​ మందు బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మద్ సిరాజ్‌ను జట్టును నుంచి విడుదల చేశామంటూ తాజాగా ప్రకటించింది. అయితే ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Mohammed Siraj England Series
Mohammed Siraj England Series
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 12:32 PM IST

Mohammed Siraj England Series : క్రికెట్​ లవర్స్​కు బీసీసీఐ ఓ షాకింగ్​ న్యూస్ తెలిపింది. టీమ్ఇండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను జట్టును నుంచి విడుదల చేశామంటూ తాజాగా ప్రకటించింది. రెండో టెస్టు ముందు ఈ నిర్ణయాన్ని తీసుకున్నామంటూ వివరిచింది. అయితే ఒక్క టెస్టుకే సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరమేంటంటూ అభిమానులు ఆరాతీయడం మొదలెట్టారు. అసలు సిరాజ్ విషయంలో ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ చర్చించుకోవడం మొదలెట్టారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సుదీర్ఘమైన సిరీస్‌‌ను, ఇటీవలే సిరాజ్ విరామం లేకుండా ఆడటాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

''వైజాగ్‌ టెస్టుకు టీమ్ఇండియా జట్టు నుంచి మహ్మద్ సిరాజ్‌ను విడుదల చేస్తున్నాం. సుదీర్ఘమైన సిరీస్, అతడు ఇటీవల ఆడిన క్రికెట్‌ను దృష్టిలో పెట్టుకొని మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. రాజ్‌కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు అతడి స్థానంలో రెండో టెస్టుకు అవేశ్ ఖాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు'' అంటూ బీసీసీఐ తాజాగా ట్వీట్ చేసింది. ఇక తొలి టెస్టులో సిరాజ్ వికెట్ సాధించని విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు ఓవర్లు ఆడిన ఈ స్టార్​ ప్లేయర్​, రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఏడు ఓవర్లు మాత్రమే వేశాడు.

India Playing 11 For 2nd Test : భార‌త్​ తుది జ‌ట్టు : రోహిత్ శ‌ర్మ‌(కెప్టెన్), య‌శ‌స్వీ జైస్వాల్, శుభ్‌మ‌న్ గిల్, జ‌స్ప్రీత్ బుమ్రా, ర‌జ‌త్ పాటిదార్, శ్రేయాస్ అయ్య‌ర్, శ్రీ‌క‌ర్ భ‌ర‌త్(వికెట్ కీపర్​), అక్ష‌ర్ ప‌టేల్, ర‌విచంద్ర‌న్ అశ్విన్, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాద‌వ్.

England Final Squad For Test Series : ఇంగ్లాండ్​ తుది జ‌ట్టు : బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలే, జానీ బెయిర్‌స్టో, బెన్ డ‌కెట్, ఓలీ పోప్, జో రూట్, బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మ‌ద్, టామ్ హ‌ర్ట్లే, షోయ‌బ్ బ‌షీర్, జేమ్స్ అండ‌ర్స‌న్.

'నిన్న మన రోజు కాదు- మేము మళ్లీ పుంజుకుంటాం'- షమీ ఎమోషనల్ పోస్ట్​!

ICC ODI Ranking 2023 : ఐసీసీ ర్యాంకింగ్స్​లో రాకెట్​లా దూసుకెళ్లిన సిరాజ్.. ఒక్క మ్యాచ్​తోనే లెక్కలు మార్చేశాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.