Mohammed Siraj Border Gavaskar Trophy : ఆస్ట్రేలియా టూర్లో భాగంగా తాజాగా జరుగుతున్న తాజా మ్యాచ్‌లో భారత స్టార్ పేసర్ సిరాజ్ దూకుడుగా ఉంటున్నాడు. రెండో టెస్టులో ట్రావిస్ హెడ్‌తో జరిగిన స్వల్ప వాగ్వాదం వల్ల సిరాజ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో చేసిన ఓ ట్రిక్ భారత్‌కు వికెట్ అందించడం విశేషం. అయితే డేంజరస్ బ్యాటర్ లబుషేన్ (12) ఔట్ కావడం వల్ల ఆసీస్ మాజీ క్రికెటర్ మ్యాథ్యూ హేడెన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అయితే సిరాజ్ చేసిన దానికి స్పందించాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించాడు.
"అతడు అప్పటికి 55 బంతులు ఆడాడు. ఎటువంటి ఇబ్బంది పడలేదు. కానీ, ఎప్పుడైతే బెయిల్స్‌ను మార్చాడో ఏకాగ్రత కోల్పోయాడు. నేను గనుక క్రీజ్‌లో ఉండుంటే బౌలర్ అలా చేసినా పట్టించుకొనేవాడిని కాదు. అసలు బౌలర్ వైపే చూడను. అతడు ఏం చేస్తున్నాడనేది అనవసరం" అని హేడెన్ పేర్కొన్నారు. బెయిల్స్ మార్పు ఘటన జరిగిన కాసేపటికే, నితీశ్ రెడ్డి వేసిన ఆఫ్‌సైడ్ బంతిని షాట్ కొట్టేందుకు ప్రయత్నించి లబుషేన్ స్లిప్‌లో విరాట్ చేతికి చిక్కాడు.
గబ్బా టెస్ట్‌లో సిరాజ్‌కు చేదు అనుభవం - గావస్కర్ ఫుల్ ఫైర్!
హెడ్ Vs సిరాజ్ - ఐసీసీ ఫైన్ విషయంలో స్టార్ పేసర్ కూల్ రిప్లై!