ETV Bharat / sports

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ - షమీ కెరీర్ బెస్ట్ గణాంకాలు ఇవే - MOHAMMED SHAMI AUSTRALIA TOUR

షమీ కెరీర్​లో బెస్ట్​ గణాంకాలు అవే!- 2018 ఆస్ట్రేలియా టూర్​లో ఏం జరిగిందంటే?

Mohammed Shami Australia Tour
Mohammed Shami (AFP)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 13, 2024, 5:37 PM IST

Mohammed Shami Australia Tour : గత కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఇప్పుడు మళ్లీ భారత జట్టులోకి చేరేందుకు సిద్ధమవుతున్నాడు. రీసెంట్​గానే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలోని రిహాబిలిటేషన్ సెంటర్​లో ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన షమీ, ఇంటర్నేషనల్​ క్రికెట్‌లోకి వచ్చే ముందు దేశవాళీ క్రికెట్‌ ఆడి, తన సత్తా చూపిస్తానని అన్నాడు షమీ. అంతేకాకుండా ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా ఆడుతానని ధీమా వ్యక్తం చేశాడు. అయితే ప్రస్తుతానికి మాత్రం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అతడిని ఎంపిక చేయలేదు.

నవంబర్ 22 నుంచి భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్ట్‌ల బోర్డర్‌-గవాస్కర్ సిరీస్​ జరగనుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఫిట్​నెస్ సాధించి జట్టులోకి ఎంపికై సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే పెర్త్ వేదికపై గతంలోనే షమీ తన అద్భుతమైన పెర్ఫామెన్స్​తో ప్రత్యర్థులను హడలెత్తించాడు. ఇంతకీ అది ఎప్పుడంటే?

2018లో పెర్త్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. ఇక ఈ సిరీస్​ కోసం అప్పటి టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ జట్టు నుంచి నలుగురు పేసర్లను రంగంలోకి దింపాడు. అందులో షమీ కూడా ఉన్నాడు. ఇక షమీ తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్​ కూడా పడగొట్టకుండా నిరాశపరిచాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చెలరేగిపోయాడు. తన బౌలింగ్ స్కిల్స్​తో ఆస్ట్రేలియా లోయర్ మిడిల్ ఆర్డర్‌ను చీల్చి చెండాడాడు. అంతేకాకుండా ఒకానొక దశలో హ్యాట్రిక్​ వికెట్లు సాధించి అందరినీ అబ్బురపరిచాడు. వరుస బంతుల్లో టిమ్ పైన్ అలాగే ఆరోన్ ఫించ్‌ లాంటి అత్యుత్తమ ప్లేయర్లను పెవిలియన్ బాట పట్టించాడు.

ముఖ్యంగా షమీ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలైన 6/56ను ఈ వేదికగానే షమీ స్కోర్ చేయడం విశేషం. దీని వల్ల టీమ్ఇండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 243 పరుగులకు చిత్తు చేసింది. అయితే బ్యాలెన్స్‌డ్ బౌలింగ్ ఎటాక్ లేకపోవడం వల్ల మ్యాచ్ ఫలితం తారుమారైంది. దీంతో 287 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించడంలో విఫలమై 146 పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది.

మరోవైపు 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న భారత్, ఆ పర్యటనలో ఓడిపోయిన ఏకైక టెస్టు కూడా ఇదే. కానీ ఆస్ట్రేలియా గడ్డపై వారికి తొలి టెస్టు సిరీస్ విజయం కావడం గమనార్హం. పేస్, అలాగే బౌన్స్‌కు పేరుగాంచిన పెర్త్ పిచ్‌ను సద్వినియోగం చేసుకుంటూ షమీ చేసిన బౌలింగ్​ భారత జట్టుకు బలాన్ని చేకూర్చింది.

టీమ్ ఇండియా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్​ - ఆ స్టార్ ప్లేయర్ రీఎంట్రీ!

క్రికెట్​ ఫ్యాన్స్​, BCCIకి సారీ- షమీ వీడియో వైరల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.