ETV Bharat / sports

'టీమ్ఇండియాలో అదే లోటు- దానిపై ఫోకస్ చెయ్యాల్సిందే' - Mithali Raj

Mithali Raj On Team India: భారత మహిళల క్రికెట్ జట్టు రీసెంట్​గా ఆసియా కప్పు కోల్పోయింది. త్వరలో టీ20 వరల్డ్‌ కప్‌ మొదలు కానుంది. టోర్నీకి ముందు జట్టులో అవసరమైన మార్పులపై మిథాలీ రాజ్‌ ఏం చెప్పిందంటే?

Mithali Raj On Team India
Mithali Raj On Team India (Source: Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 7:20 PM IST

Mithali Raj On Team India: మహిళల టీ20 ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌కు నిరాశ తప్పలేదు. అజేయంగా ఫైనల్‌ చేరిన హర్మన్‌సేనను శ్రీలంక ఫైనల్​లో ఓడించి షాక్‌ ఇచ్చింది. ఈ ఓటమి పక్కన పెడితే 2024 అక్టోబర్‌లో ప్రతిష్టాత్మక మహిళల టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. మెగా టోర్నీలో సత్తా చాటాలంటే భారత్‌ అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉండాలి. దీనిపై భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తాజాగా స్పందించింది. భారత్‌ నెం.3 బ్యాటింగ్ పొజిషన్‌లో చాలా మందిని ఆడిస్తోందని ఆ స్థానాన్ని మెరుగుపరచుకోవడంపైనే కీలక దృష్టి పెట్టాలని ఆమె అభిప్రాయపడింది. రాబోయే మహిళల T20 ప్రపంచ కప్‌కు టీమ్ఇండియా ఎలా సిద్ధపడాలో తెలిపింది. జట్టులో అవసరమైన కొన్ని మార్పులపై సూచనలు చేసింది.

'టీమ్ఇండియా అక్టోబరులో జరగనున్న టీ20 వరల్డ్​కప్​లో ఆడనుంది. భారత్​ నంబర్ 3 బ్యాటింగ్ పొజిషన్ మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలని నేను భావిస్తున్నాను. టీమ్ ఇంకా ఆ పొజిషన్‌లో సరైన బ్యాటర్ కోసం వెతుకుతోంది. ఇప్పటికే హేమలతను, చెత్రీని ప్రయత్నించారు. కానీ, వన్​డౌన్​లో షఫాలీ, స్మృతి అందించే ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్లగల బ్యాటర్‌ అవసరం. అలాగే బౌలింగ్ విషయంలోనూ ఫోకస్‌ చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం 5 మంది బౌలర్లతో ఆడుతున్నారు. వారికి బహుశా 6వ బౌలర్ అవసరం కావచ్చు. ఆల్‌ రౌండర్‌ని ఎంచుకుంటే అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్‌ చేయగలరని నేను భావిస్తున్నాను. ప్రపంచ కప్‌లోకి అడుగుపెట్టే ముందు ఈ సమస్యలను భారత్‌ అధిగమించాలి' అని మిథాలీ వివరించింది.

ఇది గొప్ప అవకాశం
టీ20 వరల్డ్‌ కప్‌కి బంగ్లాదేశ్‌ ఆతిథ్యం ఇవ్వనుండటం భారత్‌కు కలిసొచ్చే అంశమని మిథాలీ తెలిపింది. 'భారత జట్టుకు నా మెసేజ్‌ ఏంటంటే గుడ్‌ క్రికెట్‌, హార్డ్‌ క్రికెట్‌ ఆడండి. గట్టి పోటీ ఇవ్వండి. బంగ్లాదేశ్‌లో టోర్నీ జరగడం మీ అందరికీ గొప్ప అవకాశం. మనకు అనుకూలమైన పరిస్థితులతో కూడిన ప్రదేశం. ఎల్లప్పుడూ మనకు స్పిన్‌ బలం. ఈసారి బ్యాటింగ్‌లో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. భారత మహిళా జట్టు సభ్యులు అందరికీ గుడ్‌ లక్‌' అని పేర్కొంది.

ఆసియా కప్ ఛాంపియన్​గా శ్రీలంక- ఫైనల్​లో తడబడ్డ భారత్ - Womens Asia Cup 2024

తొలి T20లో భారత్ గ్రాండ్​ విక్టరీ- పోరాడి ఓడిన లంక - Ind vs SL 1T20

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.