ETV Bharat / sports

ముంబయి జోరుకు బ్రేక్- యూపీ గ్రాండ్ విక్టరీ

MI vs UPW WPL 2024: మహిళల ప్రీమియర్​ లీగ్​లో యూపీ వారియర్స్ బోణీ కొట్టింది. బుధవారం ముంబయితో జరిగిన మ్యాచ్​లో 7 వికెట్ల తేడాతో నెగ్గింది.

MI vs UPW WPL 2024
MI vs UPW WPL 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 10:35 PM IST

MI vs UPW WPL 2024: 2024 డబ్ల్యూపీఎల్​లో యూపీ వారియర్స్ ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. వరుసగా రెండు మ్యాచ్​ల్లో ఓడిన యూపీ, బుధవారం డిఫెండిగ్ ఛాంపియన్ ముంబయిపై గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ప్రత్యర్థి నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని యూపీ 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గ్రేస్ హారిస్ (38 పరుగులు*), దీప్తి శర్మ (27 పరుగులు*) రాణించారు. ఓపెనర్ కిరణ్ నౌగిరె (57 పరుగులు 31 బంతుల్లో) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు అలీసా హీలీ (33 పరుగులు) అదరగొట్టింది. ముంబయి బౌలర్లలో ఇస్సీ వాంగ్ 2, అమెలియా కేర్ 1 వికెట్ దక్కించుకున్నారు.

162 పరుగుల లక్ష్య ఛేదనను యూపీ ఘనంగా ఆరంభించింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన ఓపెనర్లు రన్​రేట్ 9కి తగ్గకుండా చూసుకున్నారు. ఈ క్రమంలోనే కిరణ్ నౌగిరె అర్ధ శతకం పూర్తి చేసుకుంది. అయితే ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో వాంగ్ ముంబయికి బ్రేక్ ఇచ్చింది. 94 పరుగుల వద్ద నౌగిరెను ఔట్ చేలి ముంబయికి తొలి వికెట్ అందించింది. ఆ వెంటనే వన్​ డౌన్​లో వచ్చిన తహిళ మెక్​గ్రాత్ (1) ఎల్​బీడబ్ల్యూగా వెనుదిరిగింది. అదే ఓవర్లో నాలుగో బంతికి మరో ఓపెనర్ హీలీ కూడా ఔటవ్వడం వల్ల ముంబయి శిబిరంలో ఆశలు చిగురించాయి. కానీ, గ్రేస్ హారిస్, దీప్తి శర్మ ముంబయికి మరో ఛాన్స్ ఇవ్వకుండా మ్యాచ్ ముగించేశారు. దీంతో వరుస విజయాలతో జోరు మీదున్న ముంబయికి బ్రేక్ పడింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 161-6 స్కోర్ చేసింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ (55 పరుగులు) హాఫ్ సెంచరీ సాధించింది. యస్తికా భాటియా (26 పరుగులు), నాట్ సీవర్ (19 పరుగులు), అమెలియా కేర్ (23 పరుగులు) భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. ఆఖర్లో వాంగ్ (15 పరుగులు; 6 బంతుల్లో: 1x4, 1x6) దూకుడుగా ఆడడం వల్ల ముంబయి స్కోర్ 160 దాటింది. యూపీ బౌలర్లలో అంజలీ, గ్రేస్ హారిస్, ఎక్సల్​స్టోన్, దీప్తీ శర్మ, రాజేశ్వరీ గైక్వాడ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

రెట్టింపు ఆనందంతో ఆర్సీబీ - చిన్నస్వామి వేదికగా రెండో విజయం

డబ్ల్యూపీఎల్​లో దిల్లీ బోణీ- 'షఫాలీ' వన్​సైడ్​ షో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.