MI vs CSK IPL 2024: 2024 ఐపీఎల్లో భాగంగా ఆదివారం స్టార్ జట్లు ముంబయి ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ తలపడగా ఈ హై వోల్టేజ్ మ్యాచులో సీఎస్కే గెలిచింది. 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఛేదనలో ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేసింది. రోహిత్ శర్మ (105 నాటౌట్; 63 బంతుల్లో 11×4, 5×6) వీరోచిత పోరాటం వృథా అయింది. పతిరన (4/28) ముంబయిని దెబ్బకొట్టాడు.
మొదట ఈ భారీ లక్ష్య ఛేదనను ముంబయి ఘనంగా ఆరంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ (23 పరుగులు, 15 బంతుల్లో) బౌండరీలతో చెన్నై బౌలర్లపై దాడికి దిగారు. వీరి ధాటికి ముంబయి 5 ఓవర్లకే 50 స్కోర్ దాటింది. ఇక జోరు మీదున్న ముంబయికి యంగ్ పేసర్ మతీషా పతిరణ కళ్లెం వేశాడు. ఓకే ఓవర్లో ఇషాన్, సూర్యకుమార్ యాదవ్ (0)ను పెవిలియన్ చేర్చి చెన్నైకి బ్రేక్ ఇచ్చాడు.
రెండు వికెట్లు కోల్పోయినా, రోహిత్ దూకుడు తగ్గించలేదు. ఈ క్రమంలోనే జడేజా ఓవర్లో ఫోర్ బాది 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫిఫ్టీ తర్వాత కూడా రోహిత్ ఫోర్లు, సిక్స్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. మరోవైపు యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ (31 పరుగులు, 19 బంతుల్లో) సైతం మెరుపులు మెరిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 31 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే పతిరన 14వ ఓవర్లో తిలక్‌ను ఔట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల సాధించాల్సిన రన్‌రేట్ బాగా పెరిగిపోయింది. చివరికి ముంబయి లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. రోహిత్ ఒక్కడే సెంచరీతో ముంబయి అభిమానులు అలరించాడు.
అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్ అజింక్యా రహానే (6), రచిన్ రవీంద్ర (21 పరుగులు) విఫలమయ్యారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (69 పరుగులు), శివమ్ దూబే (66* పరుగులు) మెరుపు హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయారు. చివర్లో డారిల్ మిచెల్ (17 పరుగుల) ఫర్వాలేదనిపించాడు.
ధోనీ మెరుపులు: ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 5 బంతులుండగా క్రీజులోకి వచ్చిన ధోనీ అదరగొట్టాడు. వరుసగా 6 6 6 2 బాది నాలుగు బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. దీంతో ధోనీ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చినట్లైంది. ధోనీ మెరుపులతోనే చెన్నై స్కోర్ 200 దాటింది. ముంబయి బౌలర్లలో హార్దిక్ పాండ్య 2, శ్రేయస్ గోపాల్, గెరాల్డ్ కోట్జీ తలో వికెట్ దక్కించుకున్నారు.
Rohit 500 T20 Sixes: ఈ మ్యాచ్‌లో ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. వాంఖడేలో సిక్సర్ల మోత మోగించిన హిట్‌మ్యాన్ టీ20ల్లో 500 సిక్స్‌లు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో టీ20ల్లో 500+ సిక్స్‌లు బాదిన ఐదో బ్యాటర్‌గా రికార్డు కొట్టాడు.
టీ20ల్లో 500+ సిక్స్‌లు బాదిన బ్యాటర్లు
- క్రిస్ గేల్ (వెస్టిండీస్)- 1056 సిక్స్‌లు
- కీరన్ పోలార్డ్ (వెస్టిండీస్)- 860 సిక్స్‌లు
- అండ్రూ రస్సెల్ (వెస్టిండీస్)- 678 సిక్స్‌లు
- కొలిన్ మున్రో (న్యూజిలాండ్)- 548 సిక్స్‌లు
- రోహిత్ శర్మ (భారత్)- 500 సిక్స్‌లు
-
🎥 It's That Moment
— IndianPremierLeague (@IPL) April 14, 2024
OUT. OF. SIGHT 💥
Rohit Sharma deposits a 90m MAXIMUM into the crowd 💪
He has moved past FIFTY and looks in brilliant touch! 👏 👏
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvCSK | @ImRo45 | @mipaltan pic.twitter.com/qfM2qiZcqd
-