Men's Test Team ranking 2024: టీమ్ఇండియా టెస్టు ర్యాంకింగ్స్ (ICC Test Team Ranking)లో అగ్రస్థానానికి దూసుకెళ్లింగి. ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో భారత్ ఒక స్థానం మెరుగుపర్చుకొని టాప్ పొజిషన్‌కు చేరుకుంది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 4-1తేడాతో నెగ్గడం వల్ల భారత్, ఆస్ట్రేలియాను అధిగమించింది. ప్రస్తుతం భారత్ 122 రేటింగ్స్‌తో టాప్‌లో ఉండగా, ఆసీస్ 117 రేటింగ్స్‌తో రెండో పొజిషన్లో ఉంది. ఇక వన్డే (121 రేటింగ్స్), టీ20 (266 రేటింగ్స్)లో కూడా టీమ్ఇండియాదే అగ్రస్థానం.
92 ఏళ్లలో తొలిసారి: భారత్ టెస్టుల్లో ఇప్పటివరకు 579 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. అందులో 178 మ్యాచ్‌ల్లో నెగ్గగా, అన్నే మ్యాచ్‌ల్లో ఓడింది. ఇక 222 మ్యాచ్‌లు డ్రా చేసుకోగా 1 టెస్టు టై అయ్యింది. అయితే భారత టెస్టు ఫార్మాట్ హిస్టరీలో తొలిసారి విజయాలు, ఓటముల సంఖ్య సమానంగా వచ్చాయి. ఇన్నేళ్లు ఓటములు ఎక్కువగా ఉంటే, విజయాలు తక్కువగా ఉండేవి. అలా 92 ఏళ్లలో తొలిసారి ఓటమి, గెలుపు సంఖ్య సమానంగా ఉంది.
WTC Points Table 2023-25: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (World Test Championship 2025)లోనూ భారత్ అగ్రస్థానంలో ఉంది. 68.51 పాయింట్ శాతంతో టీమ్ఇండియా పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక ప్రస్తుత డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో 9 మ్యాచ్‌లు ఆడిన భారత్ 6 టెస్టుల్లో నెగ్గింది. రెండింట్లో ఓడగా, ఒక టెస్టును డ్రా చేసుకుంది. ఈ టేబుల్లో న్యూజిలాండ్ 60.00 పాయింట్ శాతంతో రెండో పొజిషన్లో ఉండగా, డిఫెండిగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా (59.09) మూడు, బంగ్లాదేశ్ (50.00) నాలుగో స్థానాల్లో కొనసాగుతున్నాయి.
Test Match Fee Insentive: టెస్టు ఫార్మాట్‌పై యంగ్ ప్లేయర్లకు ఆసక్తి పెంచే విధంగా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే మ్యాచ్ ఫీజుకు అదనంగా ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు శనివారం బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. ఈ లెక్కన ఒక సంవత్సర కాలంలో భారత్ 9 మ్యాచ్‌లు ఆడుతుందని అనుకుంటే, అందులో 4 టెస్టులకంటే తక్కువ ఆడిన ప్లేయర్లకు ఈ ఇన్సెంటివ్ వర్తించదు. 50 శాతం అంటే 5-6 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ రూ.30 లక్షలు అందుకుంటాడు. సిరీస్‌కు ఎంపికై తుది జట్టులో లేకపోయినా రూ.15 లక్షలు దక్కుతాయి. ఇక 7 అంతకంటే ఎక్కువ (75 శాతం) మ్యాచ్‌లు ఆడిన ఆటగాడికి బీసీసీఐ అత్యధికంగా రూ.45 లక్షలు చెల్లించనుంది. ఇందులో కూడా బెంచ్‌కు పరిమితమైనా రూ.22.50 లక్షలు అందుకుంటారు. కాగా, ప్రస్తుతం ఒక్కో టెస్టు మ్యాచ్‌కు బేసిక్ ఫీజు రూ.15 లక్షలు ఉంది.
ఆఖరి టెస్టు భారత్‌దే- బజ్‌బాల్‌ను పిండేసిన రోహిత్ సేన, 4-1తో సిరీస్ కైవసం
టెస్టు ఫార్మాట్ ఫీజు పెంచిన బీసీసీఐ- ఒక్కో మ్యాచ్‌కు రూ.45 లక్షలు!