Shreyas Iyers Sister Shresta Iyer : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మైదానంలో దూకుడైన ఆటతీరుతో అలరిస్తుంటాడు. కెప్టెన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. అయితే మైదానంలో ఈ అయ్యర్ అదరగొడుతుంటే, డిజిటల్ రంగంలో మరో అయ్యర్ దూసుకుపోతోంది. ఆమెనే శ్రేయస్ సోదరి శ్రేష్ట అయ్యర్.
ఏప్రిల్ 29న మహారాష్ట్రలోని ముంబయిలో జన్మించిన శ్రేష్ట, తన సోదరుడు శ్రేయస్‌తో కలిసి ముంబయిలో పెరిగింది. చదువుకొనే సమయంలోనే శ్రేయస్ క్రికెట్‌పై మక్కువ చూపగా శ్రేష్ట డాన్స్‌పై శ్రద్ద పెట్టింది. సోషల్ మీడియాను తన డాన్సింగ్ స్కిల్స్, కొరియోగ్రఫీ టాలెంట్‌ను బయటపెట్టే వేదికగా మార్చుకుంది. అలా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో తన ఇష్టాయిష్టాలు, అభిరుచులను తరచుగా షేర్ చేసే శ్రేష్టకు సుమారు 1.30 లక్షల ఫాలోవర్లు ఉన్నారు.
హిట్ పాటలకు డాన్స్ వీడియోలు, రీల్స్ చేస్తూ ఇన్‌స్టాలో శ్రేష్ఠ అదరగొడుతంటుంది. అంతే కాకుండా ఫ్యామిలీతో కలిసి గడిపిన మూమెంట్స్‌ను షేర్ చేస్తుంటుంది. అప్పుడప్పుడు శ్రేష్ట అయ్యర్ సోషల్ మీడియాలో తన త్రోబాక్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. తన సోదరుడితో ఉన్న బంధాన్ని, అతడి కెరీర్‌లో వచ్చే ప్రతి మలుపులోనూ తన సపోర్ట్‌ను తెలియజేస్తూ ఉంటుంది. శ్రేయస్ కెరీర్ ఎదుగుదలలో శ్రేష్ట పాత్ర ఎంత ఉందో, శ్రేష్ట డిజిటల్ రంగంలో రాణించడం వెనక శ్రేయస్ పాత్ర కూడా అంతే ఉంది. ఈ బ్రదర్ అండ్ సిస్టర్ ఒకరి కెరీర్‌కు మరొకరు అండగా నిలిచారు.
శ్రేష్ట ముంబయిలోని లోధా వరల్డ్ క్రెస్ట్‌లోని విలాసవంతమైన 4 - BHK అపార్ట్‌మెంట్‌లో తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి నివసిస్తోంది . శ్రేష్ట పెట్ లవర్, తరచుగా పెట్స్‌తో ఉండే ఫోటోలు వీడియోలను కూడా పంచుకుంటుంది. ఆమెకు @we_are_pawerful అనే మరో ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది. ఇది పూర్తిగా జంతు సంక్షేమానికి సంబంధించినది.
ఇందులో శ్రేష్ట కుక్కలు, పిల్లులతో ఆడుకొనే వీడియోలు మాత్రమే కాదు వాటికి చిన్నపాటి గాయాలు అయితే చికిత్స చేయటం, అనారోగ్యంతో ఉంటే అవసరాన్నిబట్టి వైద్యుల దగ్గరికి తీసుకెళ్లి చికిత్స చేయించే వీడియోలు కూడా ఉన్నాయి. ఫేస్‌బుక్‌లో కూడా శ్రేష్ట ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది.
శ్రేయస్ అయ్యర్ - మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందాలంటే ఏం చేయాలి? - Shreyas Iyer Central Contract