Fastest Ball In Cricket : టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వెరైటీ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో అతడు 181.6 కి.మీ. వేగంతో బంతిని విసిరాడు! అయితే అది నిజం కాదు. స్పీడ్ గన్‌లో సాంకేతిక లోపం వల్ల అలా జరిగింది. 25 ఓవర్లో సిరాజ్ వేసిన ఓ బంతి ఏకంగా 181.6 కి.మీ. వేగంతో దూసుకెళ్లినట్లు స్పీడ్ గన్ చూపించింది. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. తీరా, సాంకేతిక లోపం వల్ల అలా జరగడం వల్ల ఇది సోషల్ మీడియాలో ఇది తెగ వైరల్ అయ్యింది. ఫుల్ మీమ్స్ క్రియేట్ అయ్యాయి.
అయితే ఇలాంటి అనుభవమే గతంలో టీమ్ఇండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు కూడా ఎదురైంది. ఓ ఓవర్‌లో భువీ 201 కి.మీ, 208 కి.మీ. వేగంతో బంతులు విసిరినట్లు స్పీడ్ గన్ చూపించింది. 2022లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది. అక్కడు కూడా స్పీడ్ గన్ పొరపాటుగా చూపించనట్లు తర్వాత తెలిసింది. దీంతో అత్యధిక వేగంలో బౌలింగ్ చేసింది సిరాజ్ కాదు భువీనే అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆ మ్యాచ్‌ను గుర్తుచేసుకుంటున్నారు.
అదే టాప్
క్రికెట్లో ఫాస్టెస్ట్ డెలివరీ పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షోబయ్ అక్తర్ పేరిటే ఉంది. అతడు ఓ బంతిని గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఈ అరుదైన రికార్డ్ నమోదైంది. ఇప్పటికీ క్రికెట్ హిస్టరీలో అత్యంత వేగవంతమైన బంతి.
Siraj bowled 181 km/hr .... fox is high pic.twitter.com/vrRsSsW25d
— Kifayat Malik (@KifayatMalik176) December 6, 2024