ETV Bharat / sports

'అది ఎప్పటికీ మర్చిపోలేను' - మయాంక్ యాదవ్ ఆరాధించే ఫాస్​ బౌలర్ ఎవరంటే? - Mayank Yadav Favourite Bowler - MAYANK YADAV FAVOURITE BOWLER

Mayank Yadav LSG Favourite Bowler : తాజాగా లఖ్​నవూ, పంజాబ్​కు జరిగిన మ్యాచ్​లో లఖ్​నవూ యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ అద్భుత ఘనత సాధించాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఫాస్టెస్ట్‌ బంతిని విసిరిన బౌలర్‌గా అవతరించాడు. అయితే తాను ఇలా ఫాస్ట్​ బౌలింగ్ చేయడానికి గల కారణం ఎవరంటే ?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 11:08 AM IST

Mayank Yadav LSG Favourite Bowler : ఐపీఎల్‌లో ఓ కొత్త చరిత్ర నమోదమైంది. రాత్రికి రాత్రి కొత్త స్టార్ వెలుగులోకి వచ్చాడు. సోషల్‌ మీడియాలో క్రికెట్‌ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ ప్లేయర్ మాయంక్ యాదవ్ పేరు మార్మోగుతోంది. ఇటీవలే జరిగిన మ్యాచ్​లో నాలుగు ఓవర్లల్లో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకుని ఆ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
ఈ పెర్ఫామెన్స్​తో మయాంక్ యాదవ్ ఓవర్ ‌నైట్ స్టార్‌ అయిపోయాడు. 18 బంతులను 145 కిలో మీటర్లకు పైగా వేగంతో, స్థిరంగా బౌలింగ్‌ చేసి మయాంక్‌ యాదవ్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. అంతలా ఈ సీమర్‌ ఎంత స్థిరంగా బౌలింగ్‌ చేశాడో ఊహించలేం. ఇందులో ఎనిమిది బంతులు 150 కిలోమీటర్లకు పైగా వేగాన్ని రికార్డ్ చేశాయంటే అతడి బౌలింగ్‌ ఏ స్థాయిలో సాగిందో చూసిందో తెలుసుకోవచ్చు. మయాంక్‌ యాదవ్ వేసిన ఓ బంతి 155.8 కిలోమీటర్లను టచ్ చేసింది. ఈ సీజన్‌లో ఇదే స్పీడ్ డెలివరి. తొలి మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా దక్కించుకున్నాడు మాయాంక్‌ యాదవ్. గత ఏడాదే ఐపీఎల్‌కు ఎంపికైనా మయాంక్‌ గాయం వల్ల ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. మయాంక్‌ను ఇప్పుడు రాజధాని ఎక్స్‌ప్రెస్‌గా పిలుస్తున్నారు.

నా ఆరాధ్య క్రికెటర్‌ అతడే
తన పెర్ఫామెన్స్​పై పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ హర్షం వ్యక్తం చేశాడు. తన ఆరాధ్య బౌలర్‌ ఎవరో కూడా చెప్పేశాడు. దక్షిణాఫ్రికా సీమర్‌ డేల్‌ స్టెయిన్‌ను తాను ఆరాధిస్తానని మయాంక్‌ తెలిపాడు. స్టెయిన్‌ వేగం, స్థిరమైన బౌలింగ్‌ అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించాడు. మయాంక్ యాదవ్ మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

" స్టెయిన్‌ వేగం, స్థిరత్వం అంటే నాకు చాలా ఇష్టం. అతని వేగం నన్ను ఉత్తేజపరుస్తుంది. నేను ఒక ఫాస్ట్ బౌలర్‌ను మాత్రమే ఆరాధిస్తాను, అది డేల్ స్టెయిన్. స్టెయిన్ అడుగుజాడలను నేను అనుసరిస్తాను. నాకు చిన్నప్పటి నుంచి వేగంగా వెళ్లేవి అంటే చాలా ఇష్టం. రాకెట్లు, విమానాలు, సూపర్‌బైక్‌లు లాంటివి నన్ను ఎక్కువ ఉత్తేజపరుస్తాయి. నా చిన్నతనంలో నేను జెట్‌లను ఎక్కువగా ఇష్టపడేవాడిని. వాటి నుంచి కూడా నేను ప్రేరణ పొందాను. సవాళ్లను అధిగమించడం నాకు ఇష్టం. గాయాలు ఫాస్ట్ బౌలర్ల జీవితంలో భాగం" అని మయాంక్‌ తెలిపాడు.

ఐపీఎల్‌లో నయా స్టార్ - బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఎవరీ మయాంక్ యాదవ్? - Who is Mayank Yadav

మయాంక్ మెరుపు వేగంతో లఖ్​నవూ బోణీ - పంజాబ్ ఓటమి - LSG VS PBKS IPL 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.