ETV Bharat / sports

నో నాన్​వెజ్- రెండేళ్లుగా ఓన్లీ వెజ్- లఖ్​నవూ స్పీడ్​గన్ డైట్ ప్లాన్ ఇదే! - Mayank Yadav Diet Plan - MAYANK YADAV DIET PLAN

Mayank Yadav Diet: ఐపీఎల్ నయా స్టార్ మయంక్ యాదల్ డైట్ గురించి అతడి తల్లి మమతా యాదవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అతడు రెండేళ్ల కిందటే నాన్​వెజ్ మానేసినట్లు చెప్పారు.

Mayank Yadav Diet Plan
Mayank Yadav Diet Plan
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 4, 2024, 5:20 PM IST

Updated : Apr 4, 2024, 5:33 PM IST

Mayank Yadav Diet: లఖ్​నవూ సూపర్ జెయింట్స్ స్పీడ్​గన్ మయంక్ యాదవ్ ప్రస్తుతం ఐపీఎల్​లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇటీవల పంజాబ్​, బెంగళూరుతో జరిగిన మ్యాచ్​ల్లో అద్భుత ప్రదర్శనతో లఖ్​నవూ విజయంలో కీలక పాత్ర పోషించిన మయంక్ గురించి క్రీడావర్గాల్లో చర్చ నడుస్తోంది. మయంక్ 150+ kmph స్పీడ్​తో నిలకడగా బౌలింగ్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. దీంతో అతడి ఫిట్​నెస్​పై కూడా ప్రసంశలు కురుసున్నాయి.

ఈ నేపథ్యంలో అతడి తల్లి మమతా యాదవ్ మయంక్ డైట్ ప్లాన్​ గురించి వెల్లడించారు. ఆటపై ఉన్న మక్కువతో మయంక్ రెండేళ్ల కిందటే మంసహారం తినడం మానేశాడని ఆమె అన్నారు. 'మయంక్ గతంలో నాన్​వెజ్ తినేవాడు. కానీ, రెండేళ్ల కిందటే మాంసహారం మానేసి పూర్తిగా వెజ్ ఫుడ్​ మాత్రమే తీసుకుంటున్నాడు. అతడి డైట్​ ప్రకారం మయంక్ ఏది అడిగితే అది మేం చేసి ఇస్తాము. అలాగని మయంక్ పెద్దగా స్పెషల్ ఫుడ్ తీసుకోడు. రోటి, పప్పు, అన్నం, పాలు, కూరగాయలు లాంటి సాధారణ ఫుడ్ తింటాడు' అని మమత అన్నారు.

'నాన్​వెజ్ ఫుడ్ మానేయడానికి గల రెండు కారణాలు మయంక్ మాతో చెప్పాడు. అందులో ఒకటి అతడు శ్రీ కృష్ణుడిని నమ్మడం మొదలుపెట్టాడు. రెండోది, నాన్​వెజ్​ తన శరీరానికి పడటం లేదన్నాడు. తను ఏది చేసినా గేమ్​ కోసం, ఫిట్​నెస్ కోసమే చేస్తున్నాడు. 100 శాతం త్వరలోనే మయంక్ టీమ్ఇండియాలో ఎంట్రీ ఇస్తాడు. ఈ విషయంలో నా కన్నా వాళ్ల నాన్నకే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది' అని మయంక్ తల్లి రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఇక ఈ పేసర్​ను జూన్​లో జరగనున్న టీ20 వరల్డ్​కప్​న ఎంపిక చేయాలన్న డిమాండ్లు సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి. ఈ మేరకు పలువురు మాజీలు కూడా ఈ విషయంపై పాజిటివ్​గా స్పందిస్తున్నారు. ఇక రీసెంట్​గా బెంగళూరుతో మ్యాచ్​లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నసందర్భంగా కూడా మయంక్ తన సక్సెస్ మంత్ర ఎంటో చెప్పాడు. 'ఫిట్​నెస్, డైట్, సరిపడా నిద్ర,ఐస్ బాత్​ వల్లే నిలకడగా వేగంగా బౌలింగ్ చేయగలుగుతున్నట్లు పేర్కొన్నాడు.

మయంక్ అవి బంతులా? బుల్లెట్లా?- లఖ్​నవూకు స్పీడ్‌ గన్‌ దొరికేసింది! - Mayank Yadav IPL 2024

'అతడిలా ఎవ్వరూ బౌలింగ్ చేవలేరు - కచ్చితంగా టీ20 వరల్డ్ కప్​కు తీసుకోవాలి' - Mayank Yadav LSG

Last Updated : Apr 4, 2024, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.