Mayank Agarwal Flight Incident : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఇటీవలే ఇండిగో విమానంలో ప్రయాణించి అక్కడ ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై మయాంక్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు.' ఇకపై అసలు రిస్క్ తీసుకోకూడు' అంటూ ఓ వాటర్ బాటిల్‌ను చేతిలో పట్టుకుని ఫొటో దిగాడు. దాన్నిఅప్లోడ్ చేసి ఆ ఫన్నీ క్యాప్షన్ రాసుకొచ్చాడు. గతంలో మంచినీళ్లు అనుకుని ఓ ద్రవాన్ని మయాంక్ తాగిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అతడు ఈ రకంగా స్పందించాడు.
-
Bilkul bhi risk nahi lene ka re babaaaaa ! pic.twitter.com/eeZy3N1qys
— Mayank Agarwal (@mayankcricket) February 19, 2024
ఇంతకీ ఏం జరిగిందంటే ?
Mayank Aggarwal Health Update : రంజీ ట్రోఫీలో భాగంగా అతడు కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే గతనెల చివరలో త్రిపురతో జరిగిన మ్యాచ్ తర్వాత దిల్లీలో విమానాన్ని ఎక్కాడు. మంచినీళ్లు అనుకొని సీటు ముందు పౌచ్‌లో ఉన్న ఓ ద్రవాన్ని కొద్దిగా సేవించాడు. అయితే దాని వల్ల అతడిు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన సిబ్బంది వెంటనే విమానాన్ని అగర్తలకు మళ్లించి అతడిని స్థానిక ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ అతడికి ప్రథమిక చికిత్స అందించిన డాక్టర్లు మయాంక్ గొంతులో వాపు, బొబ్బలు వచ్చినట్లు గుర్తించారు. దీంతో వెంటనే చికిత్స అందించారు. ఆ తర్వాతి రోజు అతడు డిశ్చార్జ్ అయ్యాడు. అయితే చికిత్స తర్వాత ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది.
Mayank Agarwal International Stats : 2011లో క్రికెట్ కెరీర్ ప్రారంభించిన మయంక్ జాతీయ జట్టులోకి రావడానికి చాలా కాలం పట్టింది. అతడు దాదాపు ఏడేళ్ల తర్వాత 2018లో టెస్టుల్లో అంతర్జాతీయ అరంగేట్ర చేశాడు. ఇప్పటివరకు 36 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన మయంక్ 41.33 సగటుతో 1488 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 2020లో వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన మయంక్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్లో పెద్దగా ఛాన్స్‌లు రాలేదు.
క్రికెట్‌కు నలుగురు స్టార్ ప్లేయర్లు గుడ్‌బై!.. WTC ఫైనల్ అయిన వెంటనే!!
టీమ్ఇండియా క్రికెటర్‌కు తీవ్ర అస్వస్థత - హెల్త్ ఎలా ఉందంటే?