Maxwell IPL 2024: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ టోర్నీ నుంచి అతడు బ్రేక్ తీసుకోనున్నాడు. తనను జట్టులోంచి తప్పించి, ఇతర ప్లేయర్లకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్, జట్టు కోచ్‌ను మ్యాక్స్‌వెల్ కోరాడట. సన్‌రైజర్స్‌తో మ్యాచ్ తర్వాత మ్యాక్స్‌వెల్ ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
'కెప్టెన్ ఫాఫ్ అండ్ కోచ్‌ను సన్‌రైజర్స్‌తో మ్యాచ్ తర్వాత కలిశాను. నా ప్లేస్‌లో వేరే ప్లేయర్‌ను ఆహ్వానించే టైమ్ వచ్చిందని వారితో చెప్పా. ప్రస్తుతం నేను బ్యాట్‌తో రాణించలేకపోతున్నాని వివరించా. అందుకే గేమ్‌కు కాస్త బ్రేక్ కావాలని అడిగాను' అని మ్యాక్స్‌వెల్ చెప్పాడు. టోర్నీలో మున్ముందు ఆర్సీబీకి తన అవసరం ఉంటే తప్పకుండా అందుబాటులో ఉంటానని క్లారిటీ ఇచ్చాడంట. ఇక సోమవారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మ్యాక్స్‌వెల్ బెంచ్‌కు పరిమితమయ్యాడు.
ప్రస్తుత ఐపీఎల్లో మ్యాక్స్‌వెల్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. 2024 ఐపీఎల్లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం 32 పరుగులు నమోదు చేశాడు. అందులో ఏకంగా మూడుసార్లు పరుగుల ఖాతా తెరవకముందే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో అత్యధిక డకౌట్ల చెత్త రికార్డు కూడా మూటగట్టుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో సైతం మ్యాక్స్‌వెల్‌పై ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు అడినట్లుగా లీగ్ క్రికెట్లో ఆడడం లేదంటూ నెటిజన్లు మండిపడ్డారు.
ఈ సీజన్లో ఆర్సీబీ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. రీసెంట్గా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లోనూ మరో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 25 పరుగుల తేడాతో ఓడింది. దీంతో వరుసగా ఐదో ఓటమి మూటగట్టుకుంది. కాగా, ఈ సీజన్లో ఓవరాల్‌గా ఇది ఆరో ఓటమి. ఇప్పటివరకూ ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం ఒకటే విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఇక ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగతా మ్యాచ్‌ల్లో నెగ్గడం ఆర్సీబీకి తప్పనిసరి. చూడాలి మరి ఇకనైనా ఆర్సీబీ గెలుపు బాట పడుతుందో లేదో.
RCBపై హెడ్ విధ్వంసం- 39 బంతుల్లోనే మెరుపు సెంచరీ - Travis Head IPL Century
కోహ్లీకి మరో అరుదైన గౌరవం - అక్కడ మైనపు విగ్రహం ఏర్పాటు - Virat Kohli statue