ETV Bharat / sports

ఐపీఎల్​ ముందు షాకింగ్ డెసిషన్​ - రిటైర్మెంట్​ ప్రకటించిన గుజరాత్ ప్లేయర్

Matthew Wade Retirement : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మాథ్యూ వేడ్​ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్​కు ముందు ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Matthew Wade Retirement
Matthew Wade Retirement
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 4:11 PM IST

Matthew Wade Retirement : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మాథ్యూ వేడ్​ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్​కు ముందు ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. పెర్త్ స్టేడియం వేదికగా జరగనున్న షెఫీల్డ్ షీల్డ్ ఫైన‌ల్​ తర్వాత అతడు ఈ ఫార్మాట్​కు వీడ్కోలు పలకున్నాడు. అయితే అతడు టీ20 క్రికెట్‌లో కొనసాగుతానంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో త‌న సుదీర్ఘ కెరీర్‌లో అండ‌గా నిలిచిన స‌హ‌చ‌రుల‌కు వేడ్ ధ‌న్య‌వాదాలు తెలిపాడు, అంతే కాకుండా తన కుటుంబం చేసిన త్యాగాలు తలుచుకుని ఎమోషనలయ్యాడు.

"సంప్రదాయ ఫార్మాట్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడాన్ని నేను ఎంతగానో ఆస్వాదించాను. వైట్‌బాల్‌ క్రికెట్‌లో కొనసాగినప్పటికీ, బ్యాగీ గ్రీన్‌తో దేశం తరఫున బరిలోకి దిగడమే నా కెరీర్‌లో ఎప్పటికైనా హైలైట్‌గా నిలుస్తుంది. కెరీర్ ఆసాంతం నాకు ఎంతగానో స‌హ‌క‌రించిన నా టీమ్​మేట్స్​కు థ్యాంక్స్. ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా రాణించేందుకు విక్టోరియా ఎంతో తోడ్ప‌డింది. నా సొంత రాష్ట్రంలోనే నేను నా కెరీర్ ముగించేందుకు అన్నివిధాలా మ‌ద్ద‌తుగా నిలిచిన టాస్మేనియాకు ధ‌న్య‌వాదాలు. నేను రెడ్ బాల్ క్రికెటర్‌గా ఆస్ట్రేలియా, ప్రపంచానికి విజయాన్ని అందించినందుకు నా కెరీర్‌ కోసం నా భార్య జూలియా, పిల్లలు వింటర్, గోల్డీ, డ్యూక్‌లు చేసిన త్యాగాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను " అంటూ మాథ్యూ ఎమోషనలయ్యాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.