Mary Kom Olympics: దిగ్గజ బాక్సర్, ఒలింపిక్స్ మెడల్ విజేత మేరీ కోమ్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత కారణాల వల్ల పారిస్ ఒలింపిక్స్ 2024 చెఫ్-డీ- మిషన్ (Chef- De- Mission) పదవి నుంచి వైదొగుతున్నట్లు ప్రకటించింది. తనను పారిస్ ఒలింపిక్స్ చెఫ్- డీ- మిషన్ పదవి నుంచి తప్పించాలని మేరికోమ్ భారత ఒలింపిక్ సంఘం(IOA) అధ్యక్షురాలు పీటీ ఉషకు లేఖ రాసింది.
'నా దేశానికి సేవ చేయడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. అయినప్పటికీ నేను ప్రతిష్ఠాత్మకమైన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించలేనందుకు చింతిస్తున్నాను. వ్యక్తిగత కారణాల వల్ల చెఫ్- డీ- మిషన్ పదవికి రాజీనామా చేశాను. పదవి నుంచి వైదొలగడం ఇబ్బందికరంగా ఉంది. కానీ నాకు వేరే మార్గం లేదు' అని పీటీ ఉషకు రాసిన లేఖలో మేరీకోమ్ పేర్కొంది.
మార్చి 21న మేరీకోమ్‌ను ఐఓఏ చెఫ్ డీ మిషన్ పదవిలో నియమించింది. దాదాపు నెలరోజుల్లోనే ఆమె ఆ పదవి నుంచి వైదొలగడం గమనార్హం. జులై 26- ఆగస్టు 11 వరకు పారిస్ ఒలింపిక్స్ జరగనున్నాయి. ఈ గేమ్స్ లో భారత ఆటగాళ్లకు మేరీకోమ్ లాజిస్టికల్ ఇన్‌ఛార్జ్‌గా ఉండవలసి ఉంది. కానీ అంతలోనే ఆమె రాజీనామా చేశారు.
'ఒలింపిక్ మెడల్ గెలుచుకున్న బాక్సర్, IOA అథ్లెట్స్ కమిషన్ ఛైర్‌పర్సన్ మేరీకోమ్ వ్యక్తిగత కారణాలను చూపుతూ ఆ పదవి నుంచి వైదొలగడం మాకు బాధ కలిగించింది. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. మేరీకోమ్ రాజీనామా లేఖ అందిన తర్వాత ఆమెతో మాట్లాడా. నేను ఆమె అభ్యర్థనను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఆమెకు నా మద్దతు, IOA ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. దిగ్గజ బాక్సర్ గోప్యతను గౌరవించాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను' అని IOA అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపారు. ఇక 41 ఏళ్ల మేరీ కోమ్ ఆటకు వీడ్కోలు పలకనుందని గతంలో ప్రచారం సాగింది. అయితే వాటిని ఆమె కొట్టిపారేసింది. తాను ఇప్పుడే బాక్సింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలనుకోవడం లేదని, ఫిట్‌నెస్‌పై దృష్టిపెడుతున్నానని తెలిపింది.
పసిడికి అడుగు దూరంలో భారత బాక్సర్లు
ఒలింపిక్స్‌లో తొలిసారిగా గోల్డ్ మెడల్ విన్నర్‌కు 50,000 డాలర్లు - Olympics Gold Medal