KL Rahul Sanjeev Goenka: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, ఆ ఫ్రాంఛైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా మధ్య ఇటీవల జరిగిన సంభాషణ క్రీడావర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో రాహుల్ తన కెప్టెన్సీని వదులుకోనున్నాడని, వచ్చే సీజన్‌కు జట్టుకు గుడ్‌బై చెప్పడం ఖాయమని కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వివాదంలో ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది.
ఓనర్ సంజీవ్ దిల్లీలోని తన నివాసానికి రాహుల్‌ను సోమవారం డిన్నర్‌కు ఆహ్వానించాడు. ఇంట్లో కెప్టెన్ రాహుల్‌ను సంజీవ్ ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ వివాదానికి ఇక ఫుల్స్టాప్ పడినట్లేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఆ రోజు రాహుల్‌తో సంజీవ్ ఏం అన్నాడనేది ఇంకా క్లారిటీ రాలేదు.
జరిగింది ఇదీ:
ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ చిత్తుగా ఓడిపోయింది. లఖ్‌నవూ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (75 పరుగులు, 28 బంతుల్లో), ట్రావిస్ హెడ్ (89 పరుగులు, 30 బంతుల్లో) ధాటిగా ఆడి 9.4 ఓవర్లలోనే సునాయాసంగా చేధించేశారు. దీంతో తమ జట్టు ప్రదర్శనపై ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా తీవ్రంగా నిరాశ చెందాడు. మ్యాచ్ అనంతరం అందరూ చూస్తుండగానే మైదానంలో కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో గొయెంకా అసహనంగా మాట్లాడాడు. దీనిపై పలువురు స్పందించారు. 'కెప్టెన్‌తో కెమెరాల మధ్య అలా మాట్లాడం ఏంటి?','ఏదైనా ఉంటే నాలుగు గదుల లోపల మాట్లాడుకోవాలి' అని మాజీ క్రికెటర్లు అన్నారు.
ఇంకా రేసులోనే: లఖ్‌నవూ ప్రస్తుత సీజన్లో ఇంకా ప్లే ఆఫ్స్ రేసులోనే ఉంది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన లఖ్‌నవూ 6 విజయాలు, 6 ఓటములతో 7వ స్థానంలో కొనసాగుతోంది. లఖ్‌నవూ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో మంగళవారం (మే 14) దిల్లీ క్యాపిటల్స్, మే 17న ముంబయితో ఆడాల్సి ఉంది. ఈ రెండిట్లో విజయం సాధిస్తే టాప్- 4కి దూసుకెళ్లే ఛాన్స్ ఉంది. కానీ, ఒక్క మ్యాచ్‌లో ఓడినా లఖ్‌నవూ ఇంటి బాట పడుతుంది.
కేఎల్ రాహుల్ - సంజీవ్ గోయెంకా గొడవపై స్పందించిన కోచ్ - ఏమన్నారంటే? - IPL 2024
మూడు ప్లేసుల కోసం ఐదు జట్ల పోటీ - ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటే? - IPL 2024