ETV Bharat / sports

'నాకు 'టెస్టు ప్లేయర్' ట్యాగ్ ఇచ్చారు- అప్పట్నుంచే ​అందరూ నన్ను నమ్మారు' - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 7:05 PM IST

Updated : May 8, 2024, 7:19 PM IST

KL Rahul IPL 2024: 2024 ఐపీఎల్​లో లఖ్​నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. కెప్టెన్​గా, బ్యాటర్​గా రాణిస్తున్నాడు. తాజాగా స్టార్​స్పోర్ట్స్​ ఇంటర్వూలో పాల్గొన్న రాహుల్ తన కెరీర్​ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.

KL Rahul IPL 2024
KL Rahul IPL 2024 (Source: Associated Press)

KL Rahul IPL 2024: లఖ్​నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్​​ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న విమర్శలు గుర్తుచేసుకున్నాడు. అప్పట్లో తనకు 'టెస్టు ప్లేయర్' అనే ట్యాగ్ ఇచ్చారని అన్నాడు. రీసెంట్​గా ప్రముఖ స్పోర్ట్స్ బ్రాడ్​కాస్ట్ స్టార్​స్పోర్ట్​ ఇంటర్వూలో రాహుల్ మాట్లాడాడు. ఇందులో తన కెరీర్​ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.

కెరీర్ ప్రారంభంలో టెస్టు ప్లేయర్ అనే ముద్ర పోగోట్టుకోడానికి రాహుల్ ఎంతో కష్టపడ్డట్లు చెప్పాడు. తాను కూడా టీ20, వన్డేల్లో ఆడగలనని అందరిలో నమ్మకం క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డట్లు తెలిపాడు. ఎన్నో రోజుల శ్రమ వల్ల వైట్​బాల్ (వన్డే, టీ20) ప్లేయర్​గా గుర్తింపు పొందినట్లు చెప్పాడు. 'కెరీర్​ ప్రారంభంలో ఓ సిక్స్​ బాదితే నేనే షాక్ అయ్యేవాడిని. అప్పట్లో నేను బలమైన టీ20, వన్డే ప్లేయర్​ కాదు. దీంతో నాకు టెస్టు ప్లేయర్ అనే ట్యాగ్ ఇచ్చారు. నేను టెస్టు ప్లేయర్ అని టీ20, వన్డే మ్యాచ్​లు ఆడలేనని అనేవారు. కానీ, 2016 ఐపీఎల్​ నా కెరీర్​లో టర్నింగ్ పాయింట్. ఆ సీజన్​లో ఆర్సీబీ తరఫున నేను బాగా (397 పరుగులు) ఆడాను. అప్పట్నుంచే నేను వైట్​బాల్​ క్రికెట్ కూడా బాగా ఆడగలనని ప్రేక్షకులు నమ్మారు. చాలా రోజులు కష్టపడిన తర్వాత నాకు ఈ గుర్తింపు దక్కింది' అని రాహుల్ అన్నాడు.

కాగా, 2016కు ముందు ఐపీఎల్​లో రాహుల్ పెర్ఫార్మెన్స్​ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. 2014, 2015 సీజన్​లలో సన్​రైజర్స్ హైదరాబాద్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రాహుల్ ఘోరంగా విఫలమయ్యాడు. 2014లో 166 పరుగులు, 2015లో 142 పరుగులు మాత్రమే చేసి ఫ్రాంచైజీకి దూరమయ్యాడు. ఆ తర్వాత రెండేళ్లు ఆర్సీబీకి ఆడిన రాహుల్ మంచి ప్రదర్శన చేశాడు. 2018లో పంజాబ్ ఫ్రాంచైజీతో చేరిన రాహుల్ జట్టులో కీలక ప్లేయర్​గా ఎదిగాడు. ఇక 2022లో లఖ్​నవూ సూపర్ జెయింట్స్​కు మారిన రాహుల్ కెప్టెన్​ అయ్యాడు. ఇక ప్రస్తుత సీజన్​లోనూ రాహుల్ బ్యాటుతో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 11మ్యాచ్​ల్లో 141.31 స్టైక్ రేట్​తో 431 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

కేఎల్ రాహుల్‌కు చోటు దక్కకపోవడానికి కారణాలు ఇవేనా? - T20 World Cup 2024

ఆ ఐదుగురు అన్​లక్కీ ప్లేయర్స్​ - T20 World Cup 2024

Last Updated : May 8, 2024, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.