ETV Bharat / sports

కొత్త కుర్రాడి మెరుపులు - లఖ్​నవూపై దిల్లీ విజయం - LSG vs DC IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 10:58 PM IST

Updated : Apr 13, 2024, 6:26 AM IST

LSG vs DC IPL 2024: 2024 ఐపీఎల్​ లీగ్​ మ్యాచ్​ల్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్​లో లఖ్​నవూపై దిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. పూర్తి వివరాలు స్టోరీలో.

LSG vs DC 2024
LSG vs DC 2024

LSG vs DC IPL 2024 : 2024 ఐపీఎల్​లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్​లో లఖ్​నవూ సూపర్ జెయింట్స్​పై దిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ఆల్​రౌండ్ ప్రదర్శనతో ఎట్టకేలకు వరుస ఓటముల నుంచి బయటపడింది. ఫలితంగా 6 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.

168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్​ మొదట్లో కాస్త తడబడింది. డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (8 పరుగులు) స్వల్ప స్కోర్​కే వెనుదిరిగాడు. వార్నర్​ను యశ్ ఠాకూర్ క్లీన్​ బౌల్డ్ చేశాడు. తర్వాత కాసేపటికి మరో ఓపెనర్ పృథ్వీ షా (32 పరుగులు) కూడా పెవిలియన్ చేరాడు. అయితే వన్​డౌన్​లో వచ్చిన జేక్ ఫ్రాజర్, రిషబ్ పంత్ మంచి ప్రదర్శన చేశారు. ముఖ్యంగా తన తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా కుర్రాడు జేక్‌ ఫ్రేజర్‌ (35 బంతుల్లో 2×4, 5×6 సాయంతో 55;), పంత్‌ (24 బంతుల్లో 4×4, 2×6 సాయంతో 41) చెలరేగడంతో దిల్లీ 4 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ (2/25) మెరిశాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన లఖ్​నవూ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (22 బంతుల్లో 5×4, 1×6 సాయంతో 39), ఆర్షద్ ఖాన్ (20* పరుగులు) రాణించారు. క్వింటన్ డికాక్ (19 పరుగులు), పడిక్కల్ (3 పరుగులు), మార్కస్ స్టోనియిస్ (8 పరుగులు), నికోలస్ పూరన్ (0), దీపక్ హుడా (10 పరుగులు), కృనాల్ పాండ్య (3 పరుగులు) విఫలమయ్యారు. ఇలా దిల్లీ బౌలర్​ కుల్​దీప్ యాదవ్ (3/20) స్పిన్‌ వలలో చిక్కుకున్న లఖ్​నవూను ఆఖర్లో ఆయుశ్ బదోనీ (55* పరుగులు, 35 బంతుల్లో) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఇతడితో పాటు అర్షద్ కూడా రాణించడం వల్ల లఖ్​నవూ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఇంకా ఖలీల్ అహ్మద్ 2, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

ఆ రెండూ నా టార్గెట్!- అప్పటిదాకా నో రిటైర్మెంట్!- ​రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - Rohit Sharma Retirement

ధోనీ కోసం స్టేడియానికి- రూ.64వేలు పెట్టి బ్లాక్​లో టికెట్ కొనుగోలు- కూతురి ఫీజు కట్టకుండా! - Dhoni Fan Ipl Ticket

Last Updated : Apr 13, 2024, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.