Rohith Sharma IPL 2025 : టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌ను వీడి కొత్త ఫ్రాంఛైజీకి మారుతాడనే వార్తలు జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఐపీఎల్ 2024లోనే ఈ ప్రచారం సాగినా అది జరగలేదు. ఇప్పుడు ఐపీఎల్ 2025 సీజన్‌లో మారుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో హిట్ మ్యాన్ ముంబయి ఇండియన్స్ టీమ్‌తోనే ఉంటాడా? లేదా? అనేది ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.
Rohith Sharma IPL 2025 Auction 50 Crores : ఈ క్రమంలోనే రోహిత్ శర్మకు సంబంధించి పలు విషయాలను సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. హిట్ మ్యాన్ మెగా వేలంలోకి వస్తాడని, అతడిని భారీ ధరకు కొనుగోలు చేస్తారని అంతా అనుకుంటున్నారు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అయితే ఏకంగా రూ.50 కోట్లైనా ఖర్చుపెట్టి దక్కించుకోవాలని ప్లాన్ చేశాయట.
అయితే ఇప్పటికీ ఈ ప్రచారంపై పంజాబ్ కింగ్స్ తరఫున సంజయ్ బంగర్ రియాక్ట్ అయ్యాడు. రోహిత్ కచ్చితంగా భారీ ధర పలుకుతాడని, అందులో ఎటువంటి అనుమానం లేదని అన్నారు. అయితే తమ ఫ్రాంఛైదీ అంత భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేస్తుందా లేదా అనేది గట్టిగా చెప్పలేనని పేర్కొన్నారు.
LSG Owner Sanjiv Goenka on Rohith Sharma : ఇప్పుడు తాజాగా ఇదే విషయంపై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా కూడా స్పందించారు. రోహిత్ శర్మ మెగా వేలంలోకి వస్తాడని ఎవరికి తెలుసు. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఇలాంటి వార్తలు వస్తుంటాయి. అసలు రోహిత్ శర్మను ముంబయి ఇండియన్స్ విడుదల చేస్తుందో లేదో కూడా తెలీదు. అతడు ఒకవేళ ఆక్షన్‌లోకి వచ్చినా, ఒక్క ప్లేయర్ కోసం పర్సులోని సగం డబ్బులను, 50 శాతం వెచ్చిస్తే, మరి మిగతా ప్లేయర్లను ఎలా కొనుగోలు చేయాలి?, 22 మందిని ఎలా మేనేజ్ చేయాలి? అని అన్నారు.
"ఏదేమైనా ఏ ఫ్రాంఛైజీ అయినా టాప్ స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేయాలని అనుకోవడం సహజమే. టీమ్‌లో బెస్ట్ కెప్టెన్, ప్లేయర్స్ ఉండాలనే అనుకుంటాం. అందుబాటులో ఉన్న వాటిలో నుంచి బెస్ట్ ప్లేయర్స్‌ను సెలెక్ట్ చేసుకుంటాం. అన్ని ఫ్రాంచైజీలు కూడా అలానే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాయి." అని చెప్పుకొచ్చారు.
బోల్ట్ వారసులు వచ్చేస్తున్నారు! - రికార్డులు బద్దలయ్యేనా? - Next Usain Bolt