Kwena Maphaka IPL 2024: ముంబయి ఇండియన్స్ యంగ్ బౌలర్ క్వేన మఫాకా 2024 ఐపీఎల్ టోర్నమెంట్‌కు దూరం కానున్నాడని సోషల్ మీడియాలో ఇటీవల వార్తలు వచ్చాయి. అతడు 10వ తరగతి పరీక్షలు రాయడానికి స్వదేశం సౌతాఫ్రికాకు బయల్దేరాడని ప్రచారం సాగింది. దీంతో ఐపీఎల్లో ఆడే ప్లేయర్ ఇంకా స్కూల్లో చదువుతున్నాడా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసింది. అవన్నీ రూమర్లేనని క్రీడా వర్లాల నుంచి క్లారిటీ వచ్చింది. క్వేన మఫాకాకు ప్రస్తుతం ఎలాంటి పరీక్షలు లేవట. అలాగే 2024 ఐపీఎల్ సీజన్ మొత్తానికి అందుబాటులోనే ఉండనున్నాడని తెలుస్తోంది. అయితే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మఫాకా ఘోరంగా విఫలమవ్వడం వల్ల తాత్కాలికంగా అతడు బెంచ్‌కు పరిమితమైనట్లు సమాచారం.ఇక 2006లో జన్మించిన సౌతాఫ్రికా యంగ్ బౌలర్ మఫాకా రీసెంట్ (ఏప్రిల్ 08)గా 18 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.
Kwena Maphaka U- 19 World Cup: ఇటీవల జరిగిన అండర్- 19 వరల్డ్‌కప్‌లో మఫాకా అద్భుతంగా రాణించాడు. ఈ టోర్నీలో ఏకంగా 21 వికెట్లు నేల కూల్చి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. దీంతో దిల్షన్ మధుషంక స్థానంలో ముంబయి ఇండియన్స్ మఫాకాను జట్టులోకి తీసుకుంది. దీంతో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుల్లో ఒకడిగా మఫాకా రికార్డు కొట్టాడు. అయితే అరంగేట్ర మ్యాచ్‌లోనే మఫాకా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ముంబయి- సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో మఫాకా ఏకంగా వికెట్ లేకుండా 66 పరుగులు ఇచ్చి, చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. తర్వాత రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఒక వికెట్ పడగొట్టినప్పటికీ 11.50 ఎకనమీతో 2 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చాడు.
ఇక ఈ సీజన్లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఆదివారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి బోణీ కొట్టింది. ఇప్పటివరకూ 4 మ్యాచ్‌లు ఆడిన ముంబయి ఒక మ్యాచ్‌లో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 234 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం దిల్లీని 205 పరుగులకే కట్టడి చేసి 2024 సీజన్లో గెలుపు రుచి చూసింది.
ముంబయి విజయం - 18 వేల మంది చిన్నారులతో నీతా అంబానీ సందడి - IPL 2024 DC VS Mumbai Indians
వాంఖడేలో 'ముంబయి' విధ్వంసం- దిల్లీ ముందు భారీ టార్గెట్ - MI vs DC IPL 2024