టీమ్ఇండియా స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. జనవరి 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ క్రెకెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో విరాట్ డకౌట్ (0) అవ్వడం పట్ల రోహిత్ స్పందించాడు. విరాట్ దూకుడుగా ఆడాలన్న ఉద్దేశంతో అలా ఔట్ అయ్యాడని రోహిత్ అన్నాడు. అయితే ఈ విషయంపై కృష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. 'ప్రతి ఆటగాడికి సొంత గేమ్ అంటూ ఒకటి ఉంటుంది. అతడు తన గేమ్‌ను ఫాలో అవ్వాలి. అలా అని వీలైనంత సమయం తీసుకోమని యశస్వి జైశ్వాల్ లాంటి కొత్త ప్లేయర్‌కు చెప్పడం కరెక్ట్ కాదు. అది రోహిత్‌కు సరైన విధానం. రోహిత్ అరంభం నుంచే దూకుడుగా ఆడగలడు. కానీ, విరాట్ కోహ్లీ నేచురల్ గేమ్ ఆడాలి. క్రీజులో వీలైనంత సమయం తీసుకోవాలి. అంతేగాని సిక్స్‌ల కోసం అందోళన చెందాల్సిన పని లేదు. మ్యాచ్ చివర్లో ఇన్నింగ్స్‌ను ఎలా బూస్ట్ చేయాలో విరాట్‌కు తెలుసు. ఆఖర్లో సిక్స్‌లు కూడా కొట్టగలడు. అతడికి ఆ సామర్థ్యం ఉంది. 2022 టీ20 వరల్డ్‌కప్‌లో మెల్బోర్న్లో అతడి ఇన్నింగ్స్ అలాంటిదే. అందుకే విరాట్ తన స్టైల్లోనే (నేచురల్‌గా) ఆడాలి' అని కృష్ణమాచారి అన్నాడు.
ఇంగ్లాడ్ టెస్టు సిరీస్ షెడ్యుల్:
- తొలి టెస్టు- జనవరి 25- 29
- రెండో టెస్టు- ఫిబ్రవరి 02- 06
- మూడో టెస్టు- ఫిబ్రవరి 15- 19
- నాలుగో టెస్టు- ఫిబ్రవరి 23- 27
- ఐదో టెస్టు- మార్చి 07- 11
ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు బీసీసీఐ రీసెంట్గా భారత జట్టును ప్రకటించింది. యంగ్ ప్లేయర్ ధృవ్ జురెల్‌కు తొలిసారి టీమ్ఇండియాలో చోటు దక్కింది.
తొలి రెండు మ్యాచ్‌లకు భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా
-
An action-packed Test series coming 🆙
— BCCI (@BCCI) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Check out #TeamIndia's squad for the first two Tests against England 👌👌#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vaP4JmVsGP
">An action-packed Test series coming 🆙
— BCCI (@BCCI) January 12, 2024
Check out #TeamIndia's squad for the first two Tests against England 👌👌#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vaP4JmVsGPAn action-packed Test series coming 🆙
— BCCI (@BCCI) January 12, 2024
Check out #TeamIndia's squad for the first two Tests against England 👌👌#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vaP4JmVsGP
ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు శ్రీకర్ భరత్ సెంచరీ - సెలక్టర్లకు హింట్!