ETV Bharat / sports

'ఆ రోజు నమ్మకం లేదని రోహిత్​తో అన్నాను' - మోదీ ప్రశ్నకు కోహ్లీ ఆన్సర్​ - Kohli Modi

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 8:13 PM IST

T20 Worldcup 2024 Kohli Modi : స్వదేశానికి తిరిగొచ్చిన టీమ్​ఇండియా ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. ఆటగాళ్లతో కాసేపు సరదాగా ముచ్చటించారు ప్రధాని. అయితే ఈ చిట్​చాట్​లో మోదీతో కోహ్లీ ఏం మాట్లాడాడంటే?

source The Associated Press and ANI
T20 Worldcup 2024 Kohli Rohith Modi (source The Associated Press and ANI)

T20 Worldcup 2024 Kohli Modi : టీ20 వరల్డ్‌ కప్‌ 2024 సెమీఫైనల్​ వరకు నిరాశపరిచిన స్టార్ బ్యాటర్ కోహ్లీ ఫైనల్​లో మాత్రం అద్భుతంగా రాణించాడు. విజయంలో కీలకంగా వ్యవహరించాడు. అయితే ఆ తుదిపోరులో తాను మంచి ప్రదర్శన చేస్తానని అనుకోలేదని అన్నాడు విరాట్​. ఆ సమయంలో తనకు నమ్మకం లేదని చెప్పుకొచ్చాడు. స్వదేశానికి తిరిగొచ్చాక ప్రధాని మోదీతో ఈ విషయాన్ని చెప్పాడు. ‘ఫైనల్‌ మ్యాచ్‌ ఆడేటప్పుడు ఒత్తిడిని ఎలా అధిగమించావు.’ అని కోహ్లీని మోదీ ప్రశ్నించగా ఈ సమాధానమిచ్చాడు.

కోహ్లీ మాట్లాడుతూ "నేను ఫైనల్ మ్యాచ్‌ను ఎప్పుడూ గౌరవిస్తాను. టోర్నమెంట్ అంతటా, నేను కోరుకున్న సహకారాన్ని అందించలేకపోయాను. ఒకానొక సమయంలో నేను రాహుల్ భాయ్‌తో - జట్టుకు నేనింకా న్యాయం చేయలేదని చెప్పాను. సమయం వచ్చినప్పుడు నవ్వు రాణిస్తావనే నమ్మకం ఉందని రాహుల్‌ భాయ్‌ నాతో చెప్పాడు. అయితే ఫైనల్ ఆడే ముందు నాపై నాకు నమ్మకం లేదు. మ్యాచ్‌కు ముందు ఇదే విషయాన్ని రోహిత్‌కు కూడా చెప్పాను. నా సామర్థ్యంపై నాకు సందేహం కలిగింది. కానీ ఆ తర్వాత మొదటి నాలుగు బంతుల్లో మూడు బౌండరీలు కొట్టినప్పుడు - రోహిత్‌తో వాట్ ఎ గేమ్ దిస్‌ ఈజ్‌. ఒక రోజు అసలేం స్కోర్‌ చేయలేమని ఫీల్‌ అవుతాం. నెక్స్ట్‌ డే అన్నీ పర్ఫెక్ట్‌గా జరుగుతాయని అన్నాను.

మ్యాచ్‌ ప్రారంభంలో వికెట్లు కోల్పోయినప్పుడు, నేను జట్టు కోసం నిలబడాలని నాకు తెలుసు. నా దృష్టి పూర్తిగా టీమ్‌కు ఏది కావాలో దానిపైనే ఉంది. తర్వాత, ప్రతిదీ ఒక కారణంతో జరుగుతుందని నేను గ్రహించాను. నా కోసం, టీమ్‌ కోసం టైటిల్ గెలవడానికి అలా జరిగింది. మేము ఫైనల్ ముగిసే వరకు ప్రతి డెలివరీని ఇంటెన్స్‌గా ఎక్స్‌పీరియన్స్‌ ఆడాం. ఫైనల్లో మా ఆలోచనలు, పరిస్థితులు, భావోద్వేగాలను పూర్తిగా మాటల్లో వివరించలేను" అని కోహ్లీ మోదీతో అన్నాడు.

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్​గా కోహ్లీ - కోహ్లీ ఈ టీ20 ప్రపంచకప్‌లో 5 మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితం అయ్యాడు. కానీ ఫైనల్‌లో 76 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడి, ఇండియా కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అందుకున్నాడు.

టీమ్ఇండియాకు భారీ నజరానా ప్రకటించిన శిందే

5 టెస్టుల సిరీస్​ - రికార్డు స్థాయిలో అందుబాటులోకి టికెట్స్‌ - IND VS Aus Border Gavaskar Trophy

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.