KL Rahul Retirement : కోహ్లీ, రోహిత్ కాకుండా గత పదేళ్లలో మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియా తరఫున ఎక్కువ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన బ్యాటర్లలో కేఎల్ రాహుల్ ఒకడు. కోహ్లీ, రోహిత్ తర్వాత ఆ స్థాయి అందుకోగల ఆటగాడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొంత కాలంగా తన మీద పెట్టుకున్న అంచనాలను అందుకోవడంలో విఫలమవుతున్నాడు. ముఖ్యంగా జట్టు తనపై నమ్మకం పెట్టుకున్న ప్రతి సారీ నిరాశపరుస్తున్నాడు.
ఆ మధ్య గాయం కారణంగా కొన్ని నెలలుగా జట్టుకు కూడా దూరంగా ఉన్నాడు. రీసెంట్‌గానే లంకతో జరిగిన వన్డే సిరీస్‌తో జట్టులోకి అడుగుపెట్టాడు. కానీ ఈ సిరీస్‌లోనూ అంచనాలను అందుకోలేకపోయాడు. త్వరలోనే బంగ్లాదేశ్‌తో జరగబోయే సిరీస్‌లో భాగం కానున్నాడని అంతా అనుకుంటున్నారు.
KL Rahul Insta post Viral : అయితే ఈ క్రమంలో ఇప్పుడు కేఎల్ రాహుల్ తన ఇంటర్నేషనల్ కెరీర్‌కు గుడ్ బై చెప్పనున్నాడా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. అందుకు కారణం తాజాగా అతడు తన అఫీషియల్ ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టిన ఓ పోస్ట్. అందులో 'ఓ అనౌన్స్మెంట్ చేయబోతున్నాను, వేచి ఉండండి' అంటూ రాసుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు రాహుల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా అంటూ ఆ పోస్ట్‌ను స్క్రీన్‌షాట్ తీసి తెగ వైరల్ చేస్తున్నారు.
Instargram Stroy of KL Rahul
— Aditya 🍉 (@Aditya_Kohli_18) August 22, 2024
-He might comeback to RCB💗 pic.twitter.com/cfDxAXUljV
ఇదే సమయంలో మరో ఫేక్ స్క్రీన్ షాట్ కూడా వైరల్ అవుతోంది. అందులో రాహుల్ తన అకౌంట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినట్లు రాసి ఉంది. అయితే ఈ ఫేక్ స్క్రీన్ షాట్ చూసిన వారు అదేమి నిజం కాదని కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి రాహుల్ ఏ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నాడో.
🚨Breaking🚨: KL Rahul announces retirement from professional cricket #KLRahul #retirement pic.twitter.com/VVFXYwrZ0B
— Chicken_ka_Leg (@Akshat900111491) August 22, 2024
KL Rahul Career and Stats : 2014లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు కేఎల్. ఇప్పటి వరకు 50 టెస్టులాడి 34.10 సగటుతో 2,863 పరుగులు చేశాడు. వన్డేల్లో 75మ్యాచుల్లో 50.36 సగటుతో 2,820 పరుగులు చేశాడు. 72 టీ20లు ఆడి సగటు 37.75తో 2,265 పరులుగు సాధించాడు.
'నాకు 'టెస్టు ప్లేయర్' ట్యాగ్ ఇచ్చారు- అప్పట్నుంచే అందరూ నన్ను నమ్మారు' - IPL 2024