KL Rahul IPL 2024 : ఐపీఎల్ ప్రారంభం కాకుండానే కొంత మంది ప్లేయర్‌లు ఆయా ఫ్రాంచైజీలకు షాకులిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం అదే గాయాల నుంచి కోలుకుని తమ సత్తా చాటేందుకు ముందుకొస్తున్నారు. అందులో రిషబ్ పంత్‌తో పాటు కేఎల్ రాహుల్ పేర్లు బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్‌పై అందరి ఫోకస్ పడింది. శస్త్రచికిత్స చేయించుకుని ఇటీవలే కోలుకున్న అతడు ఐపీఎల్‌లో ఆడేందుకు రెడీగా ఉన్నాడు. దీనికోసం ఎన్‌సీఏ నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కూడా పొందాడు.
అయితే అతడు ఫిట్‌గా ఉన్నప్పటికీ కొంత కాలం కీపింగ్ బాధ్యతలకు దూరంగా ఉండాలంటూ బీసీసీఐ సూచించింది. ఈ నేపథ్యంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌లో కీపింగ్ బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారు? రాహుల్‌కి ప్రత్యామ్నాయం ఎవరు రానున్నారు? అన్న అంశలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
పూర్తి ఫిట్‌నెస్ సాధించే వరకు, ఐపీఎల్‌లో ప్రారంభంలో వికెట్ కీపింగ్ చేయకూడదంటూ కేఎల్ రాహుల్‌ని డాక్టర్లు సూచించారు. అయితే ఇప్పుడు రాహుల్ స్థానాన్ని భర్తి చేసేందుకు వారి స్క్వాడ్‌లో ఇద్దరు ఎక్స్‌పీరియన్స్‌డ్ వికెట్ కీపర్లు ఉన్నారు. మాజీ దక్షిణాఫ్రికా ఆటగాడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, కీపర్ క్వింటన్ డి కాక్, వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్ రూపంలో ఈ జట్టుకు బెస్ట్ ఆప్షన్లు ఉన్నాయి. ఇక ఈ సీజన్‌కు పూరన్ వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.
ఆ ఇద్దరి నుంచి గట్టి పోటీ?
జూన్‌లో యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కి భారత్ జట్టులో చోటు సంపాదించాలంటే రాహుల్‌కి వికెట్ కీపింగ్ సామర్థ్యం చాలా కీలకం. రాహుల్ మునుపటి పెర్ఫామెన్స్లతో పాటు రానున్న ఐపీఎల్‌లో రాణిస్తే, ఐదు లేదా ఆరు స్థానాల్లో కీపర్-బ్యాట్స్‌మన్‌గా రాహుల్ అవకాశం పొందవచ్చు.
ఈ పొజిషన్‌కి ఇప్పటికే రిషబ్ పంత్, సంజూ శాంసన్ వంటి ప్లేయర్‌ల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. చాలా కాలం తర్వాత క్రికెట్ ఆడనున్న పంత్, లయ అందుకుంటే రాహుల్‌కి కష్టాలు తప్పవు. మరో పక్క సంజు శాంసన్ ఐపీఎల్ రికార్డులు పరిశీలిస్తే అతని సామర్థ్యం తెలుస్తుంది. శాంసన్ ఫామ్ అందుకుంటే వరల్డ్ కప్ టీ20 ఆపర్చునిటీ దక్కే అవకాశాలే ఎక్కువ.
రాహుల్ ఎంట్రీ అప్పుడే
ఇటీవల ముగిసిన భారత్, ఇంగ్లాండ్ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రాహుల్ గాయపడ్డాడు. హైదరాబాద్‌లో జరిగిన మొదటి టెస్టు తర్వాత సిరీస్‌కి దూరమయ్యాడు. మూడో టెస్టుకు తిరిగొస్తాడని, మొదట భావించినప్పటికీ పూర్తిగా కోలుకోకపోవడం వల్ల మొత్తం టెస్ట్ సిరీస్ కోల్పోయాడు. ఎట్టకేలకు ఐపీఎల్ మొదలయ్యే ముందు రాహుల్‌కి ఎన్‌సీఏ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది.
రాహుల్ ఇటీవల నేషనల్ క్రికెట్ అకాడమీ బేసిక్ కీపింగ్ కసరత్తులు, ఔట్‌ఫీల్డ్ ప్రాక్టీస్‌తో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న చిన్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అప్‌డేట్స్ తెలిసిన ఓ బీసీసీఐ అధికారి తెలిపిన వివరాల మేరకు మార్చి 24న రాజస్థాన్ రాయల్స్‌తో మొదటి మ్యాచ్ ఆడేందుకు టీమ్ జైపూర్‌కు వెళ్లే ముందు మార్చి 20న గురువారం కేఎల్ రాహుల్, లఖ్‌నవూలో టీమ్‌తో జాయిన్ అవుతాడని సమాచారం.
IPL 2024లో కేఎల్ రాహుల్ ఆడతాడా? లేదా? - కీలక అప్డేట్
కేఎల్ రాహుల్ టీ20 భవిష్యత్తు ఏంటో? - రెస్ట్ ఇచ్చారా? పక్కన పెట్టేశారా?