KL Rahul Border Gavaskar Trophy : పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి సెషన్‌లోనే భారత్ కాస్త నెమ్మదిగా ఆడుతోంది. ఇప్పటికే 4 వికెట్లు కోల్హోయి అభిమానులను ఆందోళన కలిగేలా చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ అనూహ్య ఘటన కాంట్రవర్సీకి దారితీసింది. థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం కారణంగా రాహుల్ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది.
ఏం జరిగిందంటే?
లంచ్ బ్రేక్‌కు ముందు ఇన్నింగ్స్ 23వ ఓవర్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌కు దిగాడు. అయితే అతడి బౌలింగ్‌లో బంతి స్వింగ్ అవుతూనే బ్యాట్ కు దగ్గరగా వెళ్లింది. దీంతో రాహుల్ బ్యాట్‌ను ఊపగా, ఆ బాల్‌ను క్యాచ్ అందుకున్న క్యారీ ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. అదే సమయంలో అతడితో పాటు ఆస్ట్రేలియా టీమ్ మొత్తం అప్పీల్ చేసింది.
అయితే ఆన్‌ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్ మాత్రం ఈ బంతిని నాటౌట్‌గా డిక్లేర్ చేశాడు. బంతిని బ్యాట్ తాకలేదనే అభిప్రాయంతో ఔట్ ఇవ్వలేదు. ఈ రివ్యూతో అసంతృప్తి చెందిన ఆసీస్ కెప్టెన్ డీఆర్ఎస్ తీసుకున్నాడు. సమీక్షలో బ్యాట్‌ను తాకినట్లు క్లారిటీ ఇవ్వలేదు. అదే సమయంలో ప్యాడ్‌ను బ్యాట్ తాకడం వల్ల స్పైక్స్ వచ్చాయి. అవి రెండూ ఒకేసారి వచ్చాయా? లేదా? అనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఫీల్డ్ అంపైర్ కూడా తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సరిగ్గా చెక్ చేయకుండానే ఈ నిర్ణయానికి రావడం సరైన పద్దతి కాదంటూ అభిప్రాయపడుతున్నారు . రాహుల్ విషయంలో పూర్తిగా అన్యాయం జరిగిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
A decision that got everyone talking! 😳
— Star Sports (@StarSportsIndia) November 22, 2024
OUT or NOT OUT? What's your take on #KLRahul's dismissal? 👀
📺 #AUSvINDOnStar 👉 1st Test, Day 1, LIVE NOW! #AUSvIND #ToughestRivalry pic.twitter.com/r4osnDOLyG
3000 పరుగుల క్లబ్‌లోకి కేఎల్
ఇదిలా ఉండగా, కేఎల్ రాహుల్ తాజాగా ఓ రేర్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 26 పరుగులు చేసిన కేఎల్, టెస్టుల్లో 3వేల మార్క్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పటివరకు రాహుల్ 54 టెస్టులు ఆడగా, అందులో మొత్తం 92 ఇన్నింగ్స్‌ల్లో 3,007 పరుగులు నమోదు చేశాడు. అందులో 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఇక అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 199 పరుగులు.
ఆసీస్‌తో మొదలైన తొలి టెస్ట్ - గిల్ గాయంపై బీసీసీఐ అప్డేట్
ఆస్ట్రేలియా టూర్‌కు రోహిత్ రెడీ- నేరుగా పెర్త్ స్టేడియానికి కెప్టెన్!