KKR Fan Ball Steal: 2024 ఐపీఎల్లో ఇటీవల (మే 11) జరిగిన ముంబయి ఇండియన్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ ఆసక్తికర సంఘటన జరిగింది. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ 9వ ఓవర్లో పీయుశ్ చావ్లా వేసిన బంతిని రస్సెల్ భారీ సిక్స్ బాదాడు. బంతి నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లింది. అయితే ప్రేక్షకుల్లో ఉన్న ఓ కేకేఆర్ ఫ్యాన్ ఆ బంతిని అందుకున్నాడు. బంతిని ఎలాగైనా తన దగ్గరే ఉంచుకోవాలని ప్లాన్ వేశాడు. ఎవరికి కనిపించకుండా బంతిని దాచేశాడు. దీంతో ఫీల్డర్లు బంతి కోసం ఎదురుచూస్తు ఉండిపోయారు.
ఇక ఎంతసేపటికీ బంతి తిరిగి రాకపోవడం వల్ల పోలీసులు స్టాండ్స్‌లోకి వచ్చారు. చివరికి ఓ పోలీసు అధికారి ఆ యువకుడి నుంచి బంతిని రికవరీ చేసుకోని తిరిగి మైదానంలోకి పంపించాడు. దీంతో కాసేపు మ్యాచ్ నిలిచిపోయింది. ఈ సీన్ అంతా ఎవరో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ యువకుడు చేసిన పనికి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. 'ఫన్నీ బాయ్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే యువకుడి నుంచి బంతి రికవరీ చేసుకునే సందర్భంలో పోలీసు అతడితో కాస్త దురుసుగా ప్రవర్తించాడు. 'పోలీసు ఆ యువకుడితో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది' అని వీడియో చూసిన నెటిజన్లు అంటున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, వర్షం ఆటంకం కలిగించడం వల్ల ఆటను 16 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 16 ఓవర్లలో కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (42 పరుగులు, 23 బంతుల్లో), నితీశ్ రానా (33 పరుగులు, 23 బంతుల్లో) రాణించారు. అనంతరం ఛేదనలో ముంబయి 16 ఓవర్లకు 8 వికెట్లకు 139 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రసెల్, హర్షిత్ రానా తలో 2, నరైన్ 1 వికెట్ దక్కించుకున్నారు. కోల్‌కతా 18 పరుగుల తేడాతో ఈ సీజన్లో తొమ్మిదో విజయం నమోదు చేసింది. దీంతో ప్రస్తుత ఎడిషన్‌లో అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టుగా నిలిచింది.
అక్షర్ పోరాటం వృథా - ఆర్సీబీ ఖాతాలో మరో సూపర్ విక్టరీ - IPL 2024
నరైన్ అరుదైన ఫీట్- మూడో ప్లేయర్‌గా ఘనత- మ్యాచ్‌లో నమోదైన రికార్డులు - IPL 2024