Keshav Maharaj Ayodhya Wishes: అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కోసం రామజన్మభూమి అందంగా ముస్తాబైంది. ఈరోజు (జనవరి 22) మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ రామమందిర ప్రారంభం సందర్భంగా ఆ దేశంలో ఉన్న భారతీయ హిందూ కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపాడు.
'అందరికీ నమస్తే, అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సం సందర్భంగా సౌతాఫ్రికాలో ఉన్న నా భారతీయులందరికీ శుభాకాంక్షలు. అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలగాలి. జై శ్రీరామ్' అని మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే కేశవ్ మహరాజ్ భారతీయ మూలాలున్న సౌతాఫ్రికా పౌరుడు. అతడి పూర్వికులు (తాత) ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పుర్‌కు చెందినవారు. కేశవ్ భార్య లెరిషా మున్సామీ ఓ కథకళి డ్యాన్సర్. ఇక రామమందిరాన్ని సందర్శించడానికి తను కూడా ఎదురుచూస్తున్నట్లు కేశవ్ తెలిపాడు. ఈసారి భారత్‌కు వచ్చినప్పుడు కచ్చితంగా అయోధ్య మందిరాన్ని సందర్శిస్తానని కేశవ్ ఓ సందర్భంలో చెప్పాడు. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడేందుకు భారత్ వచ్చిన కేశవ్, కేరళలోని పద్మనాభస్వామి ఆలయాన్నికి వెళ్లాడు.
గతంలో సౌతాఫ్రికా ఆడిన మ్యాచ్‌ల్లో కేశవ్ బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో పలుమార్లు రాముడి పాటలు ప్లే చేశారు. రీసెంట్గా సౌతాఫ్రికా- భారత్ టెస్టు, వన్డే సిరీస్‌లోనూ ఆదిపురుష్ సినిమాలోని 'సీతా రామ్' పాట ప్లే చేశారు. 'నువ్వు వచ్చినప్పుడు రాముడి పాట ప్లే చేస్తున్నారు' అని టీమ్ఇండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, కేశవ్‌తో చెప్పాడు. దీంతో కేశవ్ కూడా నవ్వుతూ అవునని బదులిచ్చాడు.
-
My favourite overseas player Keshav Maharaj sends his wishes in regards to Ram Mandir pran-pratistha samaroh in Ayodhya pic.twitter.com/PIOi8cfEDQ
— Squint Neon (@TheSquind) January 21, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">My favourite overseas player Keshav Maharaj sends his wishes in regards to Ram Mandir pran-pratistha samaroh in Ayodhya pic.twitter.com/PIOi8cfEDQ
— Squint Neon (@TheSquind) January 21, 2024My favourite overseas player Keshav Maharaj sends his wishes in regards to Ram Mandir pran-pratistha samaroh in Ayodhya pic.twitter.com/PIOi8cfEDQ
— Squint Neon (@TheSquind) January 21, 2024
-
Keshav Maharaj on visiting Ram Mandir in Ayodhya 🙏pic.twitter.com/zCWdZCaAVZ
— Nirmal Roy (@nroy11) January 21, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Keshav Maharaj on visiting Ram Mandir in Ayodhya 🙏pic.twitter.com/zCWdZCaAVZ
— Nirmal Roy (@nroy11) January 21, 2024Keshav Maharaj on visiting Ram Mandir in Ayodhya 🙏pic.twitter.com/zCWdZCaAVZ
— Nirmal Roy (@nroy11) January 21, 2024
-
KL Rahul - Every time you come to bat, they play the Ram Siya Ram song.
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Keshav Maharaj - Ya...!!! pic.twitter.com/ldLDlmxRV4
">KL Rahul - Every time you come to bat, they play the Ram Siya Ram song.
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 21, 2023
Keshav Maharaj - Ya...!!! pic.twitter.com/ldLDlmxRV4KL Rahul - Every time you come to bat, they play the Ram Siya Ram song.
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 21, 2023
Keshav Maharaj - Ya...!!! pic.twitter.com/ldLDlmxRV4
-
Today again 🥰
— Harish Chauhan (@HC_2304) January 3, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Keshav Maharaj comes to bat and they started playing Ram Siya Ram Song 🙏🙏😍❤️#INDvsSA pic.twitter.com/TfMCitlYf2
">Today again 🥰
— Harish Chauhan (@HC_2304) January 3, 2024
Keshav Maharaj comes to bat and they started playing Ram Siya Ram Song 🙏🙏😍❤️#INDvsSA pic.twitter.com/TfMCitlYf2Today again 🥰
— Harish Chauhan (@HC_2304) January 3, 2024
Keshav Maharaj comes to bat and they started playing Ram Siya Ram Song 🙏🙏😍❤️#INDvsSA pic.twitter.com/TfMCitlYf2
Saina Nehwal Reached Ayodhya: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆదివారం సాయంత్రమే ఆయోధ్య చేరుకుంది. సోమవారం జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకానుంది.'ఆయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి రావడం అదృష్టంగా భావిస్తున్నా' అని సైనా మీడియాతో చెప్పింది.
క్రికెటర్లకు ఆహ్వానాలు: దేశవ్యాప్తంగా పలువురు క్రీడాకారులకు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపింది. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనీ, సౌరభ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్‌కు ఆహ్వానం అందింది.