ETV Bharat / sports

రబాడ అరుదైన ఘనత- తొలి బౌలర్​గా రికార్డ్​

టెస్టుల్లో సౌతాఫ్రికా పేసర్ రబాడ అరుదైన ఘనత- తొలి బౌలర్​గా రికార్డ్​

author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

kagiso Rabada
kagiso Rabada (Source: Getty Images)

Kagiso Rabada 300 Wickets : సౌతాఫ్రికా పేసర్ కగిసొ రబాడ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అతి తక్కువ బంతుల్లో 300 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి బౌలర్​గా రికార్డు సృష్టించాడు. టెస్టు కెరీర్​లో రబాడ 11,817 బంతుల్లోనే 300 వికెట్ల క్లబ్​లో చేరాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రబాడ ఈ మైలురాయి అందుకున్నాడు. ఈ మ్యాచ్​లో బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్‌ వికెట్​తో రబాడ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ పేసర్ వకార్‌ యూనిస్ (12,602 బంతుల్లో)ను అధిగమించాడు.

కాగా, 2015లో టెస్టు అరంగేట్రం చేసిన రబాడ ఇప్పటివరకు 65 మ్యాచ్​ల్లో సౌతాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 302 వికెట్లు పడగొట్టాడు. అటు బ్యాటింగ్​లో 932 పరుగులు చేశాడు.

అతితక్కువ బంతుల్లో 300వికెట్లు తీసిన బౌలర్లు

  • కగిసో రబడ (సౌతాఫ్రికా )*-11817 బంతులు
  • వకార్ యూనిస్ (పాకిస్థాన్)-12602 బంతులు
  • డేల్ స్టెయిన్ (సౌతాఫ్రికా )- 12605 బంతులు
  • అలెన్ డొనాల్డ్ (సౌతాఫ్రికా )-13672 బంతులు

స్ట్రైక్ రేట్​లో రబాడనే టాప్
టెస్టుల్లో 300 వికెట్లను ఇప్పటివరకు 38 మంది తీశారు. అయితే అందరిలో మెరుగైన స్ట్రైక్‌ రేట్​ రబాడనే సాధించాడు. రబాడ స్ట్రైక్‌ రేట్​ 39.3. అతని తర్వాతి స్థానంలో ఉన్న డేల్ స్టెయిన్ 42.3. వీరిద్దరూ సౌతాఫ్రికా బౌలర్లే కావడం గమనార్హం. అంటే టెస్టుల్లో రబాడ ప్రతి 39 బంతులకు సగటున ఒక్క వికెట్ పడగొడుతున్నాడు.

ఆరో బౌలర్​గానూ రికార్డు
అలాగే సౌతాఫ్రికా స్టార్ పేసర్ డెల్ స్టెయిన్, అలెన్ డొనాల్డ్ తర్వాత వేగంగా 300 టెస్టు వికెట్లు తీసిన మూడో సౌతాఫ్రికా పేసర్​గా రబాడ చరిత్రకెక్కాడు. రబాడ 65వ టెస్టులో ఈ మార్కును చేరుకోగా, స్టెయిన్ 61, డొనాల్డ్ 63వ టెస్టులో ఈ ఘనత సాధించాడు. అదే విధంగా టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆరో సౌతాఫ్రికా బౌలర్‌గానూ రబాడ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో డేల్‌ స్టెయిన్‌(439) టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు.

సౌతాఫ్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు

  • డేల్ స్టెయిన్ (93 మ్యాచ్ లు) -439 వికెట్లు
  • షాన్ పోలాక్ (108 మ్యాచ్ లు)- 421 వికెట్లు
  • మఖాయ ఎన్తీనీ (101 మ్యాచ్ లు)- 390 వికెట్లు
  • అలన్ డోనాల్డ్ (72 మ్యాచ్ లు)- 330 వికెట్లు
  • మోర్నీ మోర్కెల్ (86 మ్యాచ్ లు)-309 వికెట్లు
  • కగిసో రబడ (65 మ్యాచ్ లు) - 302* వికెట్లు

చెలరేగిన రబాడ- తడబడ్డ టీమ్ఇండియా- ఆదుకున్న రాహుల్

ఆ ఘనత సాధించిన తొలి బ్యాటర్​గా కోహ్లీ.. మూడో బౌలర్​గా రబాడ

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.