Junaid Khan On IPL: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జునైద్ ఖాన్ మరోసారి ఐపీఎల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఇటీవల హైదరాబాద్ వేదికగా ముంబయి ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ రికార్డు స్థాయి స్కోర్ సాధించడం పట్ల జునైద్ అసహనం వ్యక్తం చేస్తూ ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్ట్ షేర్ చేశాడు. 'ఐపీఎల్లో ఫ్లాట్ పిచ్‌లు, చిన్న బౌండరీలు ఉంటాయి. 278 టార్గెట్' అంటూ రాసుకొచ్చాడు.
కాగా, తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ సునీల్ నరైన్ దిల్లీపై ఆడిన ఇన్నింగ్స్ గురించి కూడా కామెంట్ చేశాడు.'ఐపీఎల్లో ఫ్లాట్ పిచ్‌లు ఉంటాయి. ఈ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం చాలా సులభం. ఇంటర్నేషనల్ టీ20ల్లో 155 పరుగులు చేసిన నరైన్ ఈరోజు ఓపెనర్‌గా వచ్చి 85 స్కోర్ చేశాడు' అని తాజా ట్వీట్లో రాశాడు. దీంతో నెటిజన్లు జునైద్‌పై ఫైర్ అవుతున్నారు. 'భారత్‌లో ఫ్లాట్ పిచ్‌లైతే 2023 వన్డే వరల్డ్‌కప్‌లో మీ జట్టు ఎందుకు బాగా ఆడలేకపోయింది' అంటూ చురకలు అంటిస్తున్నారు.
కాగా, బుధవారం దిల్లీ క్యాపిటల్స్‌తో విశాఖపట్టణం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేయర్ సునీల్ నరైన్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఓపెనింగ్ బ్యాటర్‌గా వచ్చిన నరైన్ 39 బంతుల్లోనే 85 పరుగులు నమోదు చేసి ఔరా అనిపించాడు. అందులో 7 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. ఈ లెక్కన 70 పరుగులు బౌండరీల ద్వారా వచ్చినవే. నరైన్తోపాటు యంగ్ బ్యాటర్ రఘువంశీ (54), ఆండ్రూ రస్సెల్ (41), రింకు సింగ్ (26) కూడా రెచ్చిపోవడం వల్ల కేకేఆర్‌కు భారీ స్కోర్ దక్కింది. 20 ఓవర్లలో కేకేఆర్ 272 పరుగులు చేసి, ప్రత్యర్థి ముంగిట భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతంరం ఛేదనలో దిల్లీ తేలిపోయింది. 17.2 ఓవర్లలోనే 166 పరుగులకు కుప్పకూలింది. దిల్లీలో కెప్టెన్ రిషభ్ పంత్ ఒక్కడే హాఫ్ సెంచరీ (55)తో మెరిశాడు.
ఇక గతవారం హైదరాబాద్ వేదికగా ముంబయి- సన్‌రైజర్స్ మ్యాచ్‌లో కూడా పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 277 పరుగులు చేసింది. అనంతరం ముంబయి కూడా ఛేదనలో దూకుడుగానే ఆడింది. 20 ఓవర్లలో ముంబయి 246కే పరిమితమై 31 పరుగుల తేడాతో ఓడింది.
విశాఖ మ్యాచ్ - దిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా భారీ విజయం - KKR VS DC IPL 2024
గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టిన సునీల్ - 7 ఫోర్లు 7 సిక్స్‌లతో విశాఖలో వీరబాదుడు - IPL 2024 DC VS KKR