ETV Bharat / sports

ఇషాన్​పై జై షా ఫైర్- వాళ్లకు కూడా వార్నింగ్! - ishan kishan ipl practice

Jay Shah On Ishan Kishan: యంగ్ క్రికెటర్లు రంజీల్లో ఆడకపోతే బోర్డు సహించదని బీసీసీఐ సెక్రటరీ జై షా హెచ్చరించారు. ఫిట్​గా ఉన్న ప్లేయర్లంతా కచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందేనని తాజాగా జై షా అన్నారు.

Jay Shah On Ishan Kishan
Jay Shah On Ishan Kishan
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 1:21 PM IST

Updated : Feb 15, 2024, 2:25 PM IST

Jay Shah On Ishan Kishan: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్​ ఇషాన్ కిషన్​కు రోజూ ఎదో రూపంలో పరోక్షంగా హెచ్చరికలు జారీ అవుతున్నాయి! బీసీసీఐ సెక్రటరీ జై షా తాజా వ్యాఖ్యలు కూడా ఇషాన్​తోపాటు మరికొంత మంది ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చినట్లుగానే ఉన్నాయి. ఫూర్తి ఫిట్​నెస్​తో ఉన్న ఆటగాళ్లందరూ రంజీ ట్రోఫీల్లో ఆడాల్సిందేనని జై షా మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో క్రమశిక్షణ తప్పిన ఆటగాళ్లను సహించేది లేదని షా తేల్చి చెప్పారు.

'డొమెస్టిక్ టోర్నీల్లో ఆడాలని కోచ్, సెలక్టర్లు, కెప్టెన్ చెబితే ​తప్పకుండా ఆడాల్సిందే. ఈ విషయాన్ని ఇదివరకే ఆటగాళ్లకు ఫొన్ చేసి చెప్పాం. దీనిపై నేనూ వాళ్లకు లెటర్ రాస్తా. బోర్డు కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్లంతా టీమ్ఇండియాకు ఆడని సమయంలో రంజీలో ఆడాలి. కాంట్రాక్ట్​లో ఉన్న ప్లేయర్లందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. గాయాల బారిన పడ్డ ఆటగాళ్లకు మాత్రమే ఇందుకు మినహాయింపు ఉంటుంది. వారిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాం. ఫిట్​గా ఉన్న వాళ్లంతా డొమెస్టిక్​లో ఆడాలి. లేకపోతే సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కుల్ని సెలక్షన్ కమిటీకి ఇచ్చేస్తా' అని ఓ ఈవెంట్​లో పాల్గొన్న షా అన్నారు.

అయితే ఈ కామెంట్లు పరోక్షంగా ఇషాన్ కిషన్​పై చేసినట్లే అనిపిస్తోంది. గతేడాది డిసెంబర్​లో సౌతాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే వచ్చేసిన ఇషాన్, అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉంటున్నాడు. రీసెంట్​గా హెడ్ కోచ్​ రాహుల్ ద్రవిడ్ సైతం ఇషాన్​ను రంజీల్లో ఆడాల్సిందేనని సూచించినా అతడు పట్టించుకోలేదు. అయితే ఇషాన్​తోపాటు రంజీలో ఆడకుండా ఇప్పటి నుంచే ఐపీఎల్​ కోసం ప్రిపేర్ అవుతున్న ప్లేయర్ల పట్ల బీసీసీఐ కోపంగా ఉంది.

విరాట్​కు మద్దతుగానే: వ్యక్తిగత కారణాల ద్వారా జట్టుకు దూరంగా ఉంటున్న విరాట్ నిర్ణయాన్ని గౌరవిస్తామని షా అన్నారు. '15 ఏళ్ల కెరీర్​లో విరాట్ ఎప్పుడు సెలవులు తీసుకోలేదు. కారణం లేకుండా విరాట్ సెలవులు ఆడగడు. మేం ప్లేయర్లను నమ్ముతాం' అని షా అన్నారు. ఇక 2024 వరల్డ్​కప్​నకు కెప్టెన్, హెడ్ కోచ్ స్థానాల్లో మార్పుల్లేవని షా స్పష్టం చేశారు.

క్రికెట్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్ - రోహిత్‌ సారథ్యంలోనే టీ20 ప్రపంచకప్‌

ఇషాన్​తో పాటు ఆ ప్లేయర్స్​కు బీసీసీఐ వార్నింగ్​ - ఇకపై అలా చేస్తేనే ఐపీఎల్​!

Last Updated : Feb 15, 2024, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.