ETV Bharat / sports

ఐసీసీ ఛైర్మన్​గా జై షా - ఈ 3 బలమైన కారణాల వల్లే ఎన్నిక! - ICC Chairman Jay Shah

Jay Shah ICC Chairman : ఐసీసీ ఛైర్మన్​గా జై షా బాధ్యతలు తీసుకునేందుకు సరైన ఛాయిస్ అనడానికి మూడు కారణాలు ఉన్నాయి. అవేంటంటే ?​​​​​

Jay Shah
Jay Shah (ANI)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 28, 2024, 1:49 PM IST

Jay Shah ICC Chairman : బీసీసీఐ ప్రస్తుత సెక్రట్రీ జై షా తాజాగా ఐసీసీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ అత్యున్నత పదవికి షా మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2024 డిసెంబర్ 1న జై షా ఈ పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే ఐసీసీ ఛైర్మన్​గా జై షా నియామకం సరైనదే అనేందుకు మూడు కారణాలు ఉన్నాయి అవేంటంటే :​​​​​

1. ఆర్థిక నైపుణ్యం వృద్ధి వ్యూహం:
బీసీసీఐకి జై షా ఎన్నో ఆర్థిక పరమైన విజయాలను అందించారు. ముఖ్యంగా ఐపీఎల్ మీడియా రైట్స్​ను సాధించడమనేది జై షా స్కిల్స్​కు నిదర్శనం. అంతేకాకుండా ఆయన బీసీసీఐని ఫైనాన్షియల్​గా ఎదిగేందుకు దోహదపడ్డారు కూడా. ఇప్పుడీ ఈ స్కిల్​ ఐసీసీకి ఎంతో ఉపయోగపడుతుందని క్రికెట్ విశ్లేషకల మాట. ఐసీసీ సభ్య దేశాల మధ్య ఆదాయ పంపిణీకి, ముఖ్యంగా చిన్న బోర్డులకు ఈ వ్యూహాత్మక నిర్వహణ ఎంతో అవసరం. ఇటువంటి జై షా చేయగలరని తెలుస్తోంది. అయితే ఆర్థిక ఒత్తిళ్ల నడుమ టెస్ట్ క్రికెట్‌కు మద్దతుగా ఓ స్పెషల్ ఫండ్​ను ఏర్పాటు చేసేందుకు జై షా చేసిన ప్రపోజల్ సంప్రదాయ క్రికెట్ ఫార్మాట్‌లను కొనసాగించడం పట్ల ఆయన వినూత్న ఆలోచనను తెలియజేస్తోంది. ​

2. క్రికెట్ అభివృద్ధి కోసం వ్యూహాత్మక దృష్టి :
జై షా దృష్టి ఆర్థిక అంశాలకు మించి క్రికెట్ అభివృద్ధిపై ఉంది. ఈశాన్య ప్రాంతాల్లో క్రికెట్ సౌకర్యాలను అభివృద్ధి చేయడం, అలాగే సాంప్రదాయేతర ప్రాంతాల్లో క్రికెట్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి విస్తృత వ్యూహాన్ని సూచిస్తుంది.​ ఇటీవలే జరిగిన T20 ప్రపంచ కప్‌ USA వంటి కొత్త ప్రదేశాల్లో హోస్ట్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఐసీసీలోనూ ఇటువంటి కొత్త ఆలోచనలు ఎంతో కీలకమైనది.​​​​​ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లీగ్‌లకు బ్లూప్రింట్‌గా మారిన ఐపీఎల్​ను సక్సెస్​ఫుల్​గా రన్​ చేసిన షా అనుభవం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాడే మరిన్ని సక్సెస్​ఫుల్ మోడల్స్​ను ప్రోత్సహించడానికి ఎంతో ఉపయోగపడుతోంది.​​​

3. క్రీడా రాజకీయాల్లో జై షా పాత్ర :
క్రికెట్ ప్రపంచం కేవలం మ్యాచ్‌లకే కాదు ​రాజకీయాలతోనూ ముడిపడి ఉంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్​షిప్స్​లో అలాగే టోర్నమెంట్ హోస్టింగ్​ విషయంలో పలు మార్లు వివాదాలు తలెత్తాయి. అయితే 2023 ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్​ విషయంలో తీవ్ర వివాదాలు చెలరేగినప్పటికీ దాన్ని ప్రతిపాదించడంలో జై షా చూపించిన లీడర్​షిప్ స్కిల్స్ ఆయన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఐసీసీలో ఆయన నైపుణ్యం వల్ల ఇటువంటి కాంట్రవర్సీలకు చెక్ పెట్టొచ్చని విశ్లేషకుల మాట.

జిల్లా స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు - గ్లోబల్​ క్రికెట్​లో జై షా పవర్​ఫుల్​గా​ ఎలా ఎదిగారంటే? - ICC New Chairman Jay Shah

ఐసీసీ ఛైర్మన్​గా జైషా! BCCI సెక్రటరీగా బీజేపీ నేత కుమారుడు!! - BCCI Secretary Post

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.