Jay Shah ICC Salary: బీసీసీఐ సెక్రటరీ జై షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్‌గా మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో క్రికెట్ అత్యున్నత బోర్డు ఛైర్మన్‌గా ఎన్నికైన ఐదో భారతీయుడిగా జై షా ఘనత సాధించారు. దీంతో ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఛైర్మన్ జైషాకు ఐసీసీ ఎంత శాలరీ చెల్లిస్తుంది? అసలు ఇన్నిరోజులు బీసీసీఐ సెక్రటరీగా ఉన్న షా కు భారత క్రికెట్ బోర్డు ఎంత జీతం ఇచ్చింది? అని నెటిజన్లు తెగ వెతికేతిస్తున్నారు. మరి బీసీసీఐ సెక్రటరీగా షా ఎంత తీసుకున్నారు? ఇకపై ఐసీసీ ఛైర్మన్‌గా ఎంత అందుకోనున్నారో తెలుసుకుందాం!
బీసీసీఐ ఎంత ఇచ్చిందంటే?
2019లో జై షా బీసీసీఐ సెక్రటరీ అయ్యారు. బీసీసీఐలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరరీ, సెక్రటరీ పోస్టులు అత్యంత గౌరవప్రదమైనవి. ఈ పదవుల్లో ఉన్న వ్యక్తులు బోర్డులో ఉన్నతాధికారులు. అయితే బీసీసీఐలో ఇలాంటి ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులకు ఎలాంటి నిర్దిష్టమైన జీతం ఉండదు. వాళ్లకు నెలనెలా లేదా వార్షికంగా ఎలాంటి శాలరీ అందదు.
అయితే బీసీసీఐ వీళ్లకు అలవెన్సులు, కాంపెన్సేషన్, రియంబర్స్మెంట్ రూపంలో కొంతమేర చెల్లిస్తుంటుంది. టీమ్ఇండియాకు సంబంధించిన ఇంటర్నేషనల్ మీటింగ్స్, ఫారిన్ టూర్స్‌లో హాజరైనందుకుగాను జై షా రోజువారిగా 1000డాలర్లు (సుమారు రూ. 82వేలు), డొమెస్టిక్ మీటింగ్స్‌లో పాల్గొంటే రోజుకు రూ.40వేలు స్టైఫెండ్ రూపంలో అందుకుంటారు. ఇక మీటింగ్స్‌తో సంబంధం లేకుండా టీమ్ఇండియాతో భారత్‌లో ప్రయాణిస్తే రోజులు రూ.30వేలు అందుకుంటారు. అలాగే భారత్‌తోపాటు, విదేశాల్లో పర్యటించినప్పుడు అక్కడ లగ్జరీ హోటల్లో బస, బిజినెస్ క్లాస్ టికెట్లు బోర్డు సమకూరుస్తుంది.
ఐసీసీ శాలరీ
బీసీసీఐ మారిదిగానే ఐసీసీలోనూ ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులకు ప్రత్యేక జీతం ఉండదు. కానీ, వాళ్ల విధులు బట్టి ప్రత్యేక అలవెన్సులు, సౌకర్యాలను బోర్డు కల్పిస్తుంది. ఐసీసీకి సంబంధించిన మీటింగ్స్, టూర్స్‌కు హాజరైనప్పుడల్లా రోజువారీ అలవెన్స్, ట్రావెలింగ్, హోటల్లో బస ఏర్పాట్లు చేస్తుంది. అయితే అది ఎంత మొత్తంలో ఉంటుదనేది ఐసీసీ ఇప్పటివరకు బయటకు వెల్లడించలేదు. కానీ, ఐసీసీ అలవెన్స్‌లు కూడా దాదాపు బీసీసీఐతో సమానంగా ఉంటాయని తెలుస్తోంది!
ఐసీసీ ఛైర్మన్‌గా జై షా - ఈ 3 బలమైన కారణాల వల్లే ఎన్నిక! - ICC Chairman Jay Shah
ICC ఛైర్మన్‌గా జై షా- ఏకగ్రీవంగా ఎన్నిక - Jay Shah ICC Chairman