ETV Bharat / sports

నాలుగు ఓవర్లలో 7 పరుగులు - ఇంటర్నేషనల్​ మ్యాచుల్లో బుమ్రా నయా రికార్డు - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

Jasprit Bumrah T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్​లో భాగంగా అఫ్గానిస్థాన్​తో జరిగిన సూపర్ 8 మ్యాచ్​లో టీమ్ఇండియా అదరగొట్టింది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్ స్కిల్స్​తో జట్టుకు కీలక వికెట్లు అందించాడు. అయితే ఇదే వేదికగా బుమ్రా పేసర్‌గా ఓ నయా రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదే

Jasprit Bumrah T20 World Cup 2024
Jasprit Bumrah T20 World Cup 2024 (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 21, 2024, 8:07 AM IST

Jasprit Bumrah T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ 2024లో ఓటమెరుగకుండా దూసుకుపోతోంది రోహిత్ సేన. వరుసగా గ్రూపు స్టేజిను విజయాలతో ముగించడమే కాకుండా సూపర్-8 స్టేజిలోనూ అఫ్గనిస్థాన్‌పై ఘన విజయం సాధించి శుభారంభాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా పేసర్ బుమ్రా కీలకంగా వ్యవహరించడమే కాకుండా ఇదే వేదికగా ఓ నయా రికార్డు నెలకొల్పాడు.

తక్కువ పరుగులిచ్చి ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఇండియన్ బౌలర్‌గా బుమ్రా రికార్డుకెక్కాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ వేసి ఏడు పరుగులే ఇవ్వడమే కాకుండా 3 వికెట్లు పడగొట్టాడు. గ్రూప్ దశలో యూఎస్ఏతో చెలరేగిన మరో టీమ్ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా దాటేశాడు బుమ్రా. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ వేసిన అర్ష్‌దీప్ 4 వికెట్లు పడగొట్టడమే కాకుండా 9 పరుగులు సమర్పించుకున్నాడు.

టీమ్ఇండియా బౌలర్లు అయిన అర్ష్‌దీప్, బుమ్రాల మధ్య చక్కటి పోటీ నెలకొంది. అర్ష్‌దీప్ ఇప్పటికే 10 వికెట్లు పడగొడితే, బుమ్రా నాలుగు టీ20 వరల్డ్ కప్ 2024లో 8 వికెట్లు పడగొట్టాడు. ఇదే కాకుండా జస్ప్రిత్ బుమ్రా పేరిట మరో రికార్డు నమోదైంది. టీ20 వరల్డ్ కప్‌లలో వరుసగా 7-8 మ్యాచ్ లలో చక్కటి ఎకానమీ కనబరిచిన ప్లేయర్‌గా ఘనత సాధించాడు. బుమ్రా తర్వాతి స్థానంలో సఫారీ ప్లేయర్ డేల్ స్టెయిన్ ఆరు వరల్డ్ కప్ మ్యాచ్‌లతో నిలిచాడు టిమ్ సౌతీ.

వెస్టిండీస్‌లోని బార్బడోస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 8 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేయడం వల్ల చేధనలో తడబడింది అఫ్గాన్​ జట్టు. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 134 పరుగులతో ఆల్ అవుట్‌గా ఇన్నింగ్స్ ముగించింది. అయితే ఇలా టీమ్ఇండియా వరుస విజయాలను ఇప్పటికీ మూడు సార్లు నమోదు చేసింది.

టీమ్ఇండియా విజయాల లిస్ట్ ఇదే :
నవంబర్ 2021 - ఫిబ్రవరి 2022 మధ్య 12 మ్యాచ్‌లు
డిసెంబర్ 2020 - జనవరి 2020 మధ్య 9 మ్యాచ్‌లు
డిసెంబర్ 2023 - జూన్ 2024 మధ్య 8 మ్యాచ్‌లు.

స్కై మెరుపులు - సూపర్‌-8లో భారత్‌ శుభారంభం - T20 World Cup 2024

టీమ్ఇండియా హోమ్ సీజన్​ షెడ్యూల్ రిలీజ్- హైదరాబాద్​లో ఎన్ని మ్యాచ్​లు అంటే? - Team India Home Series 2025

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.