Jachintha Kalyan Pitch Curator : ఇప్పటివరుకు పురుషులకే పరిమితంగా ఉన్న కొన్ని రంగాల్లో మహిళలు కూడా రాణించి తమ సత్తా చాటుతున్నారు. అందులో క్రికెట్ కూడా ఒకటి. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, మిథాలీ రాజ్ ఇలా ఎంతో మంది స్టార్స్ ఈ ఫీల్డ్‌లో దూసుకెళ్తున్నారు. అయితే ఒకప్పుడు రిసెప్షనిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఓ మహిళ ఇప్పుడు దేశపు తొలి మహిళా క్రికెట్ పిచ్ క్యూరేటర్‌గా చరిత్రెక్కారు.
బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతోన్న డబ్ల్యూపీఎల్ కోసం పిచ్‌ను తయారు చేసి ఈ ఘనతను అందుకున్నారు. ఇంతకీ ఆమెవరో కాదు కర్ణాటకకు చెందిన జచింత కల్యాణ్. ప్రస్తుతం ఆమె ఈ బాధ్యతలను అందుకోగా, దేశమంతటా జచింతను ప్రశంసలతో ముంచెత్తుతోంది. బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా సోషల్ మీడియా వేదికగా ఆమెను కొనియాడుతూ పోస్ట్ చేశారు. తన పనితీరుకు మెచ్చుకుంటూ ప్రశంసలతో ముంచెత్తారు.
"జచింత కల్యాణ్ మన దేశపు తొలి మహిళా క్రికెట్ పిచ్ క్యూరేటర్‌గా అవతరించారు. బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభంలో పిచ్ తయారీ బాధ్యతలను నిర్వర్తించిన జచింత ఈ ఘనత సాధించడం ఆమె నిబద్ధత, ధైర్యానికి నిదర్శనం. ఈలీగ్ కోసం పిచ్‌ను పర్యవేక్షించడంలో ఆమె పాత్ర ఆటకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. పిచ్ క్యూరేటర్ పాత్రలో ఆమె రావడం భారత్‌లో క్రికెట్ అభివృద్ధి చెందుతున్న దృశ్యాన్ని ప్రతిబింబిస్తోంది" అంటూ షా జచింతను కొనియాడారు.
Jachintha Kalyan Career : ఇక జచింత కెరీర్ విషయానికి వస్తే- 19 ఏళ్ల వయసులో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌లో రిసెప్షనిస్ట్‌గా జచింత తన కెరీర్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేఎస్‌సీఎకు అనేక సేవలు అందించారు. పిచ్ క్యూరేటర్ల జట్టులోనూ భాగంగానూ ఉన్నారు.
-
In a historic stride for Indian cricket, Jacintha Kalyan has become the trailblazing pioneer as the first female cricket pitch curator in our nation. 🙌 Taking the helm of pitch preparation for the inaugural leg of the Women's Premier League in Bengaluru, Jacintha embodies the… pic.twitter.com/AVqLondy77
— Jay Shah (@JayShah) February 27, 2024
Women Umpires In Cricket : ఇదిలాఉండగా, గతంలో మహిళా క్రికెటర్లు కూడా వృందా రాఠి, జనని నారాయణన్, గాయత్రి వేణుగోపాలన్. మహిళా అంపైర్లుగా మారి చరిత్ర సృష్టించారు. గతంలో రంజీ వేదికగా ఈ ముగ్గురూ తమ బాధ్యలను స్వీకరించి సమర్ధవంతంగా నిర్వర్తించారు.
తొలిసారిగా మహిళా అంపైర్ల అరంగేట్రం.. బీసీసీఐ అవకాశంతో..!
అలా చేస్తే మహిళా క్రికెట్‌కు తిరుగుండదు- WPL 2024లో ఆ మార్పు చేయాలి! : స్మృతి మంధాన