Cricket Banned City: గతంలో కొన్ని దేశాలకే పరిమితమైన క్రికెట్ ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది. చిన్నపిల్లల నుంచి నడివయసు వాళ్ల వరకూ సమయం దొరికితే చాలు బ్యాట్, బాల్ తీసేస్తుంటారు. గల్లీల్లో, ఇరుకు వీధుల్లో బుల్లి క్రికెటర్లు ఎందరో మనకు కనిపిస్తుంటారు. ఈ టీ20ల యుగంలో క్రికెట్ మరింత పాపులర్ అయిపోయింది. అయితే ఇటలీలోని ఓ నగరం క్రికెట్ పై బ్యాన్ విధించింది. ఒకవేళ తమ మాటను ఉల్లంఘించి క్రికెట్ ఆడితే జరిమానా వేస్తామని ప్రకటించింది. ఇంతకీ కారణం ఏంటంటే?
100 యూరోల జరిమానా!
ఉత్తర ఇటలీలోని మోన్ ఫాల్కోన్ పట్టణం క్రికెట్ పై బ్యాన్ విధించింది. ఒకవేళ ఈ కట్టుబాటును ఉల్లంఘించి క్రికెట్ ఆడినవారికి 100 యూరోలు (భారత కరెన్సీలో రూ. 9,325) వరకు జరిమానా వేస్తామని హెచ్చరించింది. ఈ విషయాన్ని మోన్ ఫాల్కోన్ పట్టణ మేయర్ అన్నా మారియా సిసింట్ ప్రకటించారు. ఈ మేరకు బీబీసీ ఓ కథనాన్ని ప్రచురించింది.
30 వేల మంది జనాభా
ఇక ఇటలీలోని మోన్ ఫాల్కోన్ అనే పట్టణం ప్రకృతి అందాలకు నెలవు. ఈ నగరంలో సుమారు 30,000 మంది జనాభా నివసిస్తున్నారు. అందులో మూడింట ఒక వంతు మంది విదేశీయులే కావడం గమనార్హం. విదేశీయుల్లో ఎక్కువ మంది బంగ్లాదేశ్ ముస్లింలే. వీరు 1990వ దశకం చివరలో ఇటలీలోని ఒక ప్రధాన షిప్ యార్డ్‌లో పని చేయడానికి వచ్చి మోన్ ఫాల్కోన్ నగరంలో స్థిరపడిపోయారు.
ముస్లింలపై మేయర్ తీవ్ర వ్యాఖ్యలు!
అలాగే మోన్ ఫాల్కోన్ మేయర్ అన్నా మారియా సిసింట్ బంగ్లాదేశ్ వలసదారులపై తీవ్ర వ్యాఖ్యలను చేసినట్లు బీబీసీ తన కథనంలో ప్రచురించింది. విదేశీయుల వల్ల తమ నగరం సంస్కృతి నెమ్మదిగా నాశనం అవుతుందని అన్నా మారియా ఆరోపించారు. బంగ్లా దేశీయులు తమ సమాజానికి ఏమీ ఇవ్వలేదని అన్నారు. వారు పట్టణం వెలుపల స్వేచ్ఛగా క్రికెట్ ఆడుకోవచ్చని వ్యాఖ్యానించారు. కాగా, మేయర్ అన్నా మారియా బంగ్లాదేశ్ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగినట్లు తెలుస్తోంది. ఆమెకు హత్య బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం. అందుకే పోలీసులు అన్నా మారియాకు రక్షణగా ఉన్నారు.
ఆ పనితో విరాట్ ఆల్మోస్ట్ బ్యాన్ - అతడి వల్ల సేఫ్! - Virat Kohli Australia Match Ban
వెస్టిండీస్ ప్లేయర్‌కు షాక్- 5ఏళ్లు బ్యాన్ చేసిన ఐసీసీ - Devon Thomas Banned