Ishan Kishan Comeback Practice: మానసిక ఒత్తిడి కారణంగా రెండు నెలలుగా టీమ్ఇండియాకు దూరంగా ఉంటున్న యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌పై కోచ్ రాహుల్ ద్రవిడ్ రీసెంట్గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతడు జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలంటే డొమెస్టిక్ క్రికెట్లో ఆడాల్సి ఉంటుందని, అప్పుడే ఇషాన్ సెలక్షన్‌కు పరిగణలోకి తీసుకుంటామని రాహుల్ ఇదివరకే స్పష్టం చేశాడు. దీన్ని యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇన్నిరోజులు ఆటకు దూరంగా ఉన్న ఇషాన్, తాజాగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. జట్టులో స్థానమే లక్ష్యంగా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బరోడా రిలయన్స్ స్టేడియంలో హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య సోదరులతో కలిసి రీసెంట్గా ఇషాన్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. 2023 వరల్డ్‌కప్‌లో గాయపడ్డ స్టార్ బ్యాటర్ హార్దిక్ పాండ్య రానున్న ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ ముగ్గురు కూడా టీమ్ఇండియా మాజీ క్రికెటర్ కిరణ్ మోరె ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మోరె తాజాగా కన్ఫార్మ్ చేశాడు.
రాహుల్ మాటలే కారణమా? ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్, ఇషాన్ విషయంపై రాహుల్ స్పందించాడు. 'ఇషాన్ కిషన్ డొమెస్టిక్ టోర్నీలో ఆడడం స్టార్ట్ చేయాలి. అప్పుడే అతడు సెలక్షన్లో ఛాయిస్‌గా ఉంటాడు. ఇప్పటికీ సెలక్షన్ కమిటీ, మేనేజ్మెంట్ ఇషాన్‌తో టచ్‌లోనే ఉంది' అని ద్రవిడ్ అన్నాడు. అయితే గతేడాది జట్టుకు దూరమైనప్పటి నుంచి ఇషాన్, ఆ తర్వాత ఎక్కడ కూడా ప్రాక్టీస్ చేసినట్లు కనిపించలేదు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలోనూ ఇషాన్ ఆడట్లేదు. ఇక ఎట్టకేలకు ఇషాన్ గ్రౌండ్లో అడుగుపెట్టాడు.
ఈ సిరీస్‌కు కష్టమే! ఇషాన్ ప్రాక్టీస్ ప్రారంభించినప్పటికీ ఇంగ్లాండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు టీమ్ఇండియాలో ప్లేస్ దక్కించుకోవడం కష్టమే అని చెప్పాలి. రంజీలో ఝార్ఖండ్- హరియాణా మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా ఇషాన్, ఝార్ఖండ్ తుది జట్టులో లేడు. దీంతో అతడు మిగిలిన మూడు టెస్టులకు ప్రాక్టికల్‌గా దూరమైనట్లే!
ఇంగ్లాండ్ సిరీస్‌తో ఇషాన్ రీ ఎంట్రీ- హింట్ ఇచ్చిన ద్రవిడ్!
టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న ఇషాన్- సౌతాఫ్రికా టూర్ నుంచి రిటర్న్